Just NationalJust PoliticalLatest News

Exit Polls :తమిళనాట విజయ్ ప్రభంజనమేనా? బెంగాల్‌లో ఓటరు మౌనం ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

Exit Polls : మెజారిటీ సర్వేలన్నీ అధికార డీఎంకే కూటమికే పట్టం కట్టగా, ప్రదీప్ గుప్తా నేతృత్వంలోని యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రం విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరిస్తుందని జోస్యం చెప్పడం హాట్ టాపిక్ అయింది.

Exit Polls

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై.. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు భారత రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపోటములపై భిన్నమైన విశ్లేషణలు వెలువడుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగా తమిళనాడు రాజకీయ చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవిడ రాజకీయాల కోటలో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సునామీ సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మెజారిటీ సర్వేలన్నీ అధికార డీఎంకే కూటమికే పట్టం కట్టగా, ప్రదీప్ గుప్తా నేతృత్వంలోని యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రం విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరిస్తుందని జోస్యం చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఈ అంచనాల ప్రకారం టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే అధికార డీఎంకే 92 నుంచి 110 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం నిజమైతే తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఫలితాల తర్వాత క్యాంపు రాజకీయాలు, బేరసారాలు మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇప్పటికే తమిళనాడులోని ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా అధికారాన్ని దక్కించుకోవాలని డీఎంకే భావిస్తోంది.

ఇంకోవైపు అన్నాడీఎంకే కూడా విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తోంది. విజయ్ కూడా తన పార్టీ అభ్యర్థులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, రిజల్ట్స్ తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొత్తంగా మే 4న వెలువడనున్న ఫలితాలు తమిళనాట రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

Exit Polls
Exit Polls

మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం మాత్రం ఈసారి అయోమయంగా ఉంది. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అనేక సర్వే సంస్థలు తమ అంచనాలను వెలువరించినా, అత్యంత విశ్వసనీయమైనదిగా భావించే యాక్సిస్ మై ఇండియా మాత్రం బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేయలేమని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

బెంగాల్ ఓటర్ల నాడిని పసిగట్టడం సాధ్యం కావడం లేదని, యాక్సిస్ మై ఇండియా సర్వేలో పాల్గొన్న వారిలో 60-70 శాతం మంది మౌనంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది. ప్రజలు తమ మనసులో మాటను బయట పెట్టడానికి భయపడుతున్నారా లేదా మరేదైనా కారణం ఉందా అనేది అంతు చిక్కడం లేదు. బెంగాల్‌లో ఈసారి రికార్డు స్థాయిలో 92 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

Exit Polls
Exit Polls

బీజేపీ తొలిసారిగా బెంగాల్‌లో జెండా ఎగురవేస్తుందని కొన్ని సర్వేలు అంచనాలు వేస్తుండగా.. మమతా బెనర్జీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారని మరికొన్ని సంస్థలు తమ తమ పోల్స్‌ను బయటపెట్టాయి. ఏదేమైనా బెంగాల్ ఓటర్లు తమ అభిప్రాయాన్ని నిశ్శబ్దంగా ఉంచడం వల్ల రిజల్ట్స్ ఎటువైపు తిరుగుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది.

తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి పుట్టుకతో రాబోయే మార్పులు, బెంగాల్‌లో ఓటర్ల నిశ్శబ్దం వెనుక దాగున్న అసలు రహస్యం మే 4 న తెలియబోతోంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

Pensioners : పెన్షనర్లకు కేంద్రం భారీ కానుక.. రూ. 7,500కు చేరనున్న కనీస పెన్షన్

Related Articles

Back to top button