Just SpiritualLatest News

Cancer : సున్నితమైన మనసు తరచూ మారే మూడ్స్.. కర్కాటకరాశికి ఏ నెంబర్ కలిసి వస్తుంది?

Cancer : వీరిలో ఉండే గొప్ప ప్లస్ పాయింట్లు ఏంటంటే ఇతరుల బాధలను కళ్ల చూసి తట్టుకోలేకపోవడం. నమ్మకమైన బంధాలను ఏర్పరచుకోవడం

Cancer

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటకరాశికి(Cancer) అధిపతి నవగ్రహాలలో మనః కారకుడైన చంద్రుడు. ఈ రాశి వారు అమితమైన ప్రేమ, జాలి, కరుణ కలిగిన సున్నిత మనస్కులు. వీరి మైండ్ సెట్ ఎప్పుడూ ఇల్లు, కుటుంబం, పిల్లలు, వారి రక్షణ, సంతోషాల గురించే ఆలోచిస్తుంది.

బయటి ప్రపంచంలో ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా, సమాజంలో ఎంత పేరు తెచ్చుకున్నా కూడా తమ మూలాలను, చిన్ననాటి జ్ఞాపకాలను వీరు అస్సలు మర్చిపోరు. ప్రతీ విషయాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి చూడటం వీరి మానసిక తత్త్వంలో ప్రధానమైన భాగం. నలుగురికీ సాయం చేయడంలో, ఇతరులను ఆదరించడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు.

వీరిలో ఉండే గొప్ప ప్లస్ పాయింట్లు ఏంటంటే ఇతరుల బాధలను కళ్ల చూసి తట్టుకోలేకపోవడం. నమ్మకమైన బంధాలను ఏర్పరచుకోవడం. ఎవరితోనైనా ఒక్కసారి బంధం ఏర్పడితే దానికి ప్రాణం ఇస్తారు. అద్భుతమైన ఊహాశక్తి, సృజనాత్మకత , దైవభక్తి వీరి సొంతం.

ఎదుటివారి మనసులో ఏముందో గ్రహించగల ఆరవ ఇంద్రియం (Intuition) వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టపడే తత్త్వంతో పాటు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా, క్రమశిక్షణతో నెరవేరుస్తారు. నమ్మకానికి, విశ్వాసానికి వీరు నిజమైన మారుపేరుగా నిలుస్తారు.

అయితే వీరిలో ఉండే పెద్ద మైనస్ పాయింట్ మూడ్ స్వింగ్స్, అంటే క్షణంలో చాలా ఆనందంగా ఉంటూనే, మరో క్షణంలో ఎలాంటి కారణం లేకుండానే తీవ్రమైన బాధలోకి లేదా డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఫీలైపోవడం, ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేక ఏడ్చేయడం వీరి బలహీనత.

గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, అవమానాలను మనసులో పెట్టుకుని పదే పదే ఆలోచిస్తూ బాధపడటం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతుంటారు. ఇతరులను అతిగా నమ్మడం వల్ల కూడా వీరు తరచూ మోసపోతుంటారు.

Cancer
Cancer

ఈ రాశి వారికి కలిసివచ్చే అదృష్ట విషయాల విషయానికి వస్తే, వీరికి అధిపతి చంద్రుడు కావడం వల్ల తెలుపు, సిల్వర్ , లేత క్రీమ్ రంగులు చాలా మంచివి. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు లేదా పూజలలో పాల్గొనేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, సక్సెస్ లభిస్తాయి.

కర్కాటకరాశి(Cancer) వారికి 2, 7 సంఖ్యలు అదృష్టాన్ని తెస్తాయి, అందులో 2 నెంబర్ వీరికి అత్యంత అనుకూలమైన సంఖ్య. ఈ రాశి వారు జగన్మాత అయిన పార్వతీదేవిని లేదా పరమశివుడిని పూజించడం చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం కానీ శివాష్టకం పఠించడం వల్ల కానీ వీరిలోని మానసిక ఆందోళనలు, మూడ్ స్వింగ్స్ తగ్గి, మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

Gemini : అద్భుతమైన మాటకారులు.. మిథునరాశి వారి అసలు నైజం ఇదే

Related Articles

Back to top button