Mount Kailash
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని వేలాది మంది ఎక్కారు.. రికార్డులు సృష్టించారు. కానీ దానికంటే సుమారు రెండు వేల మీటర్ల తక్కువ ఎత్తున్న కైలాస పర్వతాన్ని(Mount Kailash) మాత్రం.. ఇప్పటివరకు ఎవరు కూడా అధిరోహించలేకపోయారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది పక్కా నిజం.
సైన్స్ ఎంతో డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా కైలాస పర్వతం(Mount Kailash).. ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. దీని వెనుకున్న కొన్ని భయంకరమైన నిజాలు, అక్కడ జరిగే వింతలు చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ పర్వతం చుట్టూ ఉన్న ఆ అయస్కాంత శక్తులు, సైన్స్ కూడా ఆన్సర్ చెప్పలేని ఎన్నో వింతలు ఉన్నాయి.
కైలాస పర్వతం(Mount Kailash) ఎక్కడానికి ట్రై చేసిన కొందరు పర్వతారోహకులు.. షేర్ చేసిన విషయాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ పర్వతం దగ్గరకు వెళ్లగానే సమయం చాలా ఫాస్టుగా గడిచిపోతుందట. సాధారణంగా మనకు కొన్ని రోజుల్లో పెరిగే గోళ్లు, జుట్టు, కైలాస పర్వతం పరిసరాల్లోకి వెళ్లగానే కేవలం కొన్ని అంటే కొన్ని గంటల్లోనే విపరీతంగా పెరిగిపోతాయట.
అంటే టైం ట్రావెల్ లాంటిదేదో అక్కడ జరుగుతోందని, ఆ ప్రాంతంలో కాలం చాలా స్పీడ్‌గా పరిగెడుతుందని సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. కానీ దానికి సైంటిఫిక్ రీజన్ మాత్రం చెప్పలేకపోతున్నారు.
దీనికి తోడు అక్కడికి వెళ్లిన వాళ్లకు దిశలు అస్సలు తెలీవట. చేతిలో ఉన్న దిక్సూచి పిచ్చిపిచ్చిగా తిరిగిపోతుందని, దారి చూపే మ్యాప్‌లు కూడా పని చేయవని చాలా మంది చెబుతారు. ఆ పర్వతం తన దిశలను తానే మార్చుకుంటూ ఎక్కేవాళ్లను తప్పుదోవ పట్టిస్తుందనే ఒక భయంకరమైన టాక్ ఉంది.
ఇక సైన్స్ పరంగా చూస్తే కైలాస పర్వతమనేది ఒక పర్వతం మాత్రమే కాదు.. అది భూమికి ఒక కేంద్రం (Axis Mundi) అని రష్యన్ సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. ప్రపంచంలోని మిగతా పర్వతాల లాగా కాకుండా, కైలాస పర్వతం ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
భూమికి ఉన్న ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలకు ఇది కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండటం వల్ల ..ఇక్కడ విపరీతమైన అయస్కాంత శక్తులు, రేడియో యాక్టివ్ పవర్స్ కేంద్రీకృతమై ఉంటాయని భావిస్తారు.
అందుకే అక్కడికి వెళ్లిన వారందరికీ కూడా వింత వింత శబ్దాలు వినపడటంతో పాటు, మనసుపై కంట్రోల్ తప్పడం వంటివి జరుగుతుంటాయి. ఎలాంటి మొండి వాడైనా, భయం లేనివారు అయినా సరే, ఆ పర్వతం ఎక్కడానికి అడుగు ముందుకు వేయగానే ఏదో ఒక అదృశ్య శక్తి వారిని వెనక్కి నెట్టేసినట్లు అవుతుందని చాలామంది తమ పర్సనల్ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం చూస్తే మాత్రం.. కైలాస పర్వతం సాక్షాత్తూ ఆ పరమశివుడి నివాస స్థానంగా చెబుతారు. హిందూ, బౌద్ధ, జైన మతాల ప్రకారం ఈ కైలాస పర్వతం అత్యంత పవిత్రమైనది. దైవ శక్తి కొలువై ఉన్న ఆ శిఖరంపై మానవులు అడుగు పెట్టడం అసాధ్యమని పురాణాలు చెబుతాయి. అందుకే ఎవరైనా అహంకారంతో ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తే ప్రకృతి వారికి ఘోరమైన శిక్షలు విధిస్తుందని నమ్మకం.
గతంలో చైనా ప్రభుత్వం కొందరికి పర్మిషన్ ఇచ్చింది. అయితే అక్కడ జరిగిన వింత పరిణామాల వల్ల కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని ఆ తర్వాత శాశ్వతంగా బ్యాన్ చేశారు. సైన్స్ శక్తులు మోకరిల్లిన చోట, కేవలం ఆధ్యాత్మిక అద్భుతం మాత్రమే మిగిలిందనడానికి కైలాస పర్వతమే ఒక సజీవ సాక్ష్యంగా చెబుతారు.
Kind People:మంచితనానికి రోజులు లేవా? సాయం చేసే వాళ్లే ఎక్కువ మోసపోతున్నారా?
