Just SpiritualLatest News

Karthika Pournami : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు? కార్తీక పౌర్ణమి వేళ దీపాలు ఎక్కడ వెలిగించాలి?

Karthika Pournami : కార్తీక పౌర్ణమి ఎప్పుడు? త్రిపురారి పౌర్ణమి విశిష్టత, 365 వత్తుల దీపారాధన, నదీ స్నానాలు, దేవ దీపావళి పూజా విధానం పూర్తి వివరాలు చూద్దాం..

Karthika Pournami

కార్తీక మాసమంటేనే ఆధ్యాత్మిక శోభ, భక్తి పారవశ్యం నిండిన నెల. ఈ మాసంలో వచ్చే రోజుల్లోకెల్లా అత్యంత మహిమాన్వితమైనది, కాంతుల సమాహారం అయినది కార్తీక పౌర్ణమిగా భావిస్తారు. 2026లో ఈ పవిత్ర పర్వదినం నవంబర్ 24వ తేదీన మంగళవారం రోజు రాబోతోంది.

మన పురాణాల్లో కార్తీక పౌర్ణమి(Karthika Pournami) రోజును త్రిపురారి పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా పిలుచుకుంటారు. సకల లోకాలను పట్టి పీడిస్తున్న త్రిపురాసురులు అనే రాక్షసులను పరమశివుడు సంహరించి, దేవతలకు మహా శాంతిని చేకూర్చిన పవిత్రమైన సందర్భంగా ఈ పౌర్ణమి గురించి చెబుతారు. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ముక్కంటిని కొలిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఈ పర్వదినం రోజు వేకువజామున లేచి పవిత్ర నదుల్లో కానీ ఇంట్లో కానీ పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో మంచిది. ఈరోజు హరిహరులైన శివకేశవులిద్దరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సాయంత్రం సమయంలో ఇంట్లోనూ శివాలయాలు, విష్ణు ఆలయాల లో దీపాలను వెలిగిస్తారు. చాలా చోట్ల భక్తులు ఏడాదిలోని ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులకు సంకేతంగా 365 వత్తులను చేసి.. దీపారాధన చేసి తమ భక్తిని చాటుకుంటారు.

అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం,పేదలకు అన్నదానం , వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి.. ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమి(Karthika Pournami) దీపాల కాంతులు మనందరి జీవితాలలో ఉన్న చీకట్లను తరిమేసి సరికొత్త వెలుగులను నింపాలని కోరుకుందాం.

Children Mistakes : మీ పిల్లలు తప్పులు చేస్తున్నారా?.. ముందు పేరెంట్స్ చెక్ చేసుకోవాల్సిన 7 అలవాట్లు ఇవే

Related Articles

Back to top button