Chennai Super Kings : మారని కోల్ కథ…చెన్నై చేతిలో పరాజయం
Chennai Super Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తీరు మారలేదు. సీజన్ మొదలై మూడు వారాలైనా కేకేఆర్ ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవనే లేదు
Chennai Super Kings
ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తీరు మారలేదు. సీజన్ మొదలై మూడు వారాలైనా కేకేఆర్ ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవనే లేదు. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన వేళ ఛేజింగ్ లో కోల్ కతా చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ చెన్నైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో విఫలమైంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నిరాశపరిచినా సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగించాడు. మరో బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో కలిసి దూకుడుగా ఆడాడు. రెండో వికెట్ కు 47 పరుగులు జోడించాడు.
ముఖ్యంగా ఆయుశ్ మాత్రే విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. సంజూ 48 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ కేవలం 29 బంతుల్లోనే 51 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. బ్రెవిస్ 29 బంతుల్లో 41 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. సర్ఫరాజ్ 23, దూబే 13, ఓవర్టన్ 7 పరుగులు చేశారు.
అయితే చివరి ఓవర్లలో కోల్ కతా బౌలర్లు చెన్నై బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి 2, అంకుల్ రాయ్, నరైన్ , వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు.
తర్వాత ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతులెత్తేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఓపెనర్ ఫిన్ అలెన్ మళ్లీ నిరాశపరిచాడు. సునీల్ నరైన్ క్రీజులో ఉన్న కొద్దిసేపు భారీ షాట్లతో అలరించాడు. 17 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 24 రన్స్ కు ఔటయ్యాడు. ఈ దశలో రహానే, రఘువంశీ ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. రింకూ సింగ్(6) , కామెరూన్ గ్రీన్ డకౌటయ్యాడు. దాదాపుగా అక్కడే కోల్ కతా ఓటమి ఖాయమైంది. అయితే పావెల్, రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడడంతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనిపించింది.
అయితే అన్షుల్ కాంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అలాంటిదేమీ సాధ్యపడలేదు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 160 పరుగులే చేయగలిగింది. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ 3 కీలక వికెట్లతో కేకేఆర్ ను దెబ్బ కొట్టాడు. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇది నాలుగో ఓటమి, అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది రెండో విజయం.
Bank of Baroda:బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. 45 ఏళ్ల వయస్సున్నవారికీ కూడా ఛాన్స్





