Just SportsLatest News

CSK vs DC : చెన్నైతో ఢిల్లీ బిగ్ ఫైట్..ఇరు జట్లకూ కీలక మ్యాచ్

CSK vs DC : ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకున్న సీఎస్కే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలపై ఆశలు పెట్టుకుంది

CSK vs DC

ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్(CSK vs DC) మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకున్న సీఎస్కే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలపై ఆశలు పెట్టుకుంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన తర్వాత చెన్నై కాన్ఫిడెన్స్ పెరిగింది.ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది.

కీలక ఆటగాళ్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నా సెకండాఫ్ లో చెన్నై బాగానే పుంజుకుంది. సంజూ శాంసన్ , కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ల బ్యాటింగ్ ఆ జట్టుకు కలిసొస్తుంది. గత మ్యాచ్ లో రుతురాజ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలతో ఫామ్ అందుకున్న రుతురాజ్ కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే చెన్నై భారీస్కోరు సాధించొచ్చు.

ఉర్విల్ పటేల్ , కార్తీక్ శర్మ , బ్రెవిస్ వంటి హిట్టర్లపై అంచనాలున్నాయి. అయితే శివమ్ దూబే తన ఫినిషర్ రోల్ కు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ సీజన్ లో దూబే పెద్దగా ఆడింది లేదు. దీంతో ఢిల్లీతో మ్యాచ్ లోనైనా అతను ఫామ్ లోకి రావాలని సీఎస్కే మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. అటు బౌలింగ్ లో ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ నిలకడగా రాణిస్తున్నారు. అతనితో పాటు స్పిన్నర్ నూర్ అహ్మద్ సత్తా చాటుతున్నాడు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్(CSK vs DC) ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రస్తుతం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అది కూడా 226 పరుగుల భారీటార్గెట్ ను ఛేదించింది. నిస్సాంక, రాహుల్, స్టబ్స్ , నితీష్ రాణా ఇలా కీలక బ్యాటర్లందరూ ఫామ్ లోకి వచ్చారు.

CSK vs DC
CSK vs DC

దీంతో బ్యాటింగ్ పరంగా ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. వీరిలో ఏ ముగ్గురు రాణించినా కూడా ఢిల్లీ ఎలాంటి టార్గెట్ నైనా ఛేదిస్తుంది. బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి రావడం ఢిల్లీ బలాన్ని పెంచింది. వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న స్టార్క్ తో పాటు కైల్ జేమీసన్ , నటరాజన్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు.

అయితే కుల్దీప్, అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ ఇంకా పూర్తిస్థాయిలో చూపించడం లేదు. గత రికార్డుల పరంగా చూస్తే చెన్నైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 32 సార్లు తలపడితే చెన్నై 20 మ్యాచ్ లలో గెలిచింది. ఇక ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.

Change : అక్కడ మార్పు కోరుకున్నారు..ఇక్కడ మార్పు వద్దనుకున్నారు

Related Articles

Back to top button