Just SportsLatest News

CSK vs SRH : జోరు కొనసాగించేదెవరు ?..చెన్నైతో పోరుకు సన్ రైజర్స్ రెడీ

CSK vs SRH : ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారం చివర్లో ఉంది. గత వారం రోజులుగా మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి

CSK vs SRH

ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారం చివర్లో ఉంది. గత వారం రోజులుగా మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ రేసులో వెనుకబడకుండా ఉండేందుకు విజయం కోసం అన్ని జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్(CSK vs SRH) జట్టు గత మ్యాచ్ తో పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మూడు మ్యాచ్ లు ఓడినా సరే రాజస్థాన్ పై సాధించిన విజయంతో రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది.

ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్(CSK vs SRH) బ్యాటర్లు అదరగొట్టారు. అభిషేక్ శర్మ, హెడ్ నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. అటు క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదనిపించారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మరికొెంచెం పుంజుకుంటే మాత్రం తిరుగుండదు.

అటు బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ పూర్తిగా గాడిన పడినట్టే కనిపిస్తోంది. అసలు సన్ రైజర్స్ కు బౌలింగ్ ఎక్కడుంది అన్న కామెంట్లకు యువ బౌలర్లు మైదానంలోనే సమాధానం చెప్పారు. ప్రఫుల్, హుస్సేన్ చెరొక ఎండ్ లో ఆ రోజు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ప్రఫుల్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం మ్యాచ్ ను మలుపుతిప్పింది.

అప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రాజస్థాన్ రాయల్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, హెడ్ నుంచి కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ లు వస్తే మాత్రం ఎదురులేనట్టే. అటు బౌలింగ్ లో ప్రఫుల్, హుస్సేన్ తో పాటు హర్షల్ పటేల్ కూడా చెలరేగితే చెన్నైని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు కనిపిస్తోంది.

CSK vs SRH
CSK vs SRH

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్(CSK vs SRH) కూడా సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సంజూ శాంసన్ ను అసలు ఎందుకు తీసుకున్నారన్న మాటలు కూడా వినిపించాయి. కానీ గత రెండు మ్యాచ్ ల నుంచి సీఎస్కే ఆటతీరు మారిపోయింది.

ఢిల్లీ తో మ్యాచ్ లో అయితే శాంసన్ సెంచరీతో రెచ్చిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే జవాబిచ్చాడు. సంజూతో పాటు ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ చెన్నై బ్యాటింగ్ కు బలంగా చెప్పొచ్చు. కెప్టెన్ రుతురాజ్ కూడా బ్యాట్ కు పనిచెబితే సీఎస్కేకు తిరుగుండదు. అటు ధోనీ ఈ మ్యాచ్ లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. బౌలింగ్ పరంగా చూస్తే ఖలీల్ అహ్మద్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బ. దీంతో అన్షుల్ కాంబోజ్ , ఓవర్టన్ , నూర్ అహ్మద్ లపైనే భారం పడనుంది.

Strait of Hormuz : హార్మూజ్ జలసంధి తెరిచిన ఇరాన్..ధన్యవాదాలు చెప్పిన ట్రంప్

Related Articles

Back to top button