Just SportsLatest News

Gujarat Titans : గుజరాత్ ఆల్ రౌండ్ షో…లక్నోపై ఘనవిజయం

Gujarat Titans : ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది

Gujarat Titans

ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండో విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఆశించిన ఆరంభం లభించలేదు. మార్ష్ (11) పరుగులకే ఔటవగా… పంత్(18), ఆయుశ్ బదోని (9) కూడా నిరాశపరిచారు.

మార్కరమ్ (30) పర్వాలేదనిపించగా, పూరన్ (19) మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. గుజరాత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లక్నో అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరి(18), లిండే (16) చివర్లో కాస్త ధాటిగా ఆడడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లతో లక్నోను దెబ్బతీశాడు. తర్వాత ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడింది. సాయిసుదర్శన్ (15) పరుగులకే ఔటైనా గిల్ , బట్లర్ అదరగొట్టారు. ఇద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ తో పరుగులు సాధించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 84 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ తో పోలిస్తే బట్లర్ తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ 40 బంతుల్లో 56 (6 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా.. బట్లర్ 37 బంతుల్లో 60 (11 ఫోర్లు) పరుగులు చేశాడు. చివర్లో వీరిద్దరూ ఔటైనా అప్పటికే గుజరాత్ విజయం ఖాయమైంది.

Gujarat Titans
Gujarat Titans

కాగా గిల్ ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

కోహ్లీ 128 ఇన్నింగ్స్ లలో 4 వేల రన్స్ పూర్తి చేయగా.. గిల్ 118 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి అందుకున్నాడు. కాగా రాహుల్ తెవాటియా 10 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 21 నాటౌట్ మ్యాచ్ ను ముగించారు. దీంతో గుజరాత్ మరో 8 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. గుజరాత్ కు ఇది రెండో విజయం.

ప్రసిద్ధ కృష్ణకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో గుజరాత్(Gujarat Titans) ఐదో స్థానానికి చేరుకోగా… లక్నో ఆరో స్థానానికి పడిపోయింది.

Asha Bhosle : దిగ్గజ గాయని ఆశా భోస్లే ఇకలేరుసంగీత ప్రపంచం ఘన నివాళి

Related Articles

Back to top button