Just SportsLatest News

Gujarat Titans : గట్టెక్కిన గుజరాత్…ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి

Gujarat Titans : ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. ఉత్కంఠ మ్యాచ్ లు లేవంటూ నిరాశపడుతున్న అభిమానులను గుజరాత్, ఢిల్లీ మ్యాచ్ టెన్షన్ పెట్టింది

Gujarat Titans

ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. ఉత్కంఠ మ్యాచ్ లు లేవంటూ నిరాశపడుతున్న అభిమానులను గుజరాత్(Gujarat Titans), ఢిల్లీ మ్యాచ్ టెన్షన్ పెట్టింది. చివరి బంతి వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఒక పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ త్వరగానే ఔటైనా సరే బట్లర్, కెప్టెన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడడంతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) స్కోరు వేగం టాప్ గేర్ లో సాగింది. ముఖ్యంగా బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.కేవలం 27 బంతుల్లో 52 (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. అటు గిల్ కూడా దూకుడుగా ఆడుతూ భారీ స్కోరే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాడు.

బట్లర్ , గిల్ రెండో వికెట్ కు 60 పరుగులు జోడించారు. గిల్ 45 బంతుల్లో 70 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. మరో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్ లలో విఫలమైన సుందర్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.గిల్ తో కలిసి వాషింగ్టన్ సుందర్ మూడో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు.

గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఫామ్ లో ఉన్న నిస్సాంక దూకుడుగా ఆడి తొలి వికెట్ కు రాహుల్ తో కలిసి 76 పరుగులు జోడించాడు. నిస్సాంక (41) ఔటైన తర్వాత ఒకే ఓవర్లో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు.

Gujarat Titans
Gujarat Titans

10వ ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా నితీష్ రాణా రిజ్విలను ఔట్ చేశాడు. అయితే ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్ మాత్రం పోరాడాడు. 52 బంతుల్లో 92 ( 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. రాహుల్ కీలక సమయంలో ఔటైనా డేవిడ్ మిల్లర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

19వ ఓవర్లో సిరాజ్ కు చుక్కలు చూపించాడు. బౌండరీలు, ఫోర్లతో విరుచుకుపడి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశాడు. సిరాజ్ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సైతం ఢిల్లీ దాదాపుగా గెలిచినట్టే అనుకున్నారు. ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీయకపోగా.. చివరి బంతికి పరుగులేమీ రాకపోవడంతో గుజరాత్ 1 పరుగు తేడాతో గెలిచింది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. అటు తాజా గెలుపుతో గుజరాత్ తన గెలుపు ఖాతాను ఓపెన్ చేసింది.

Defensive :మీరు తప్పు చేసి తిరిగి మీరే గట్టిగా మాట్లాడుతున్నారా? అయితే డిఫెన్సివ్ సైకాలజీ గురించి తెలుసుకోండి..

Related Articles

Back to top button