Just SportsLatest News

Gujarat Titans : గుజరాత్ హ్యాట్రిక్..మళ్లీ ఓడిన కోల్ కతా

Gujarat Titans : ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. హోంగ్రౌండ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది

Gujarat Titans

ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జోరు కొనసాగుతోంది. హోంగ్రౌండ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చినా కేకేఆర్ కు మాత్రం కలిసి రాలేదు. పేలవ ఫామ్ తో ఉన్న రహానే మరోసారి ఫెయిలయ్యాడు.

ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. రఘువంశీ(8) కూడా నిరాశపరిచాడు. అటు ఫిన్ అలెన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సిఫెర్ట్ 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా కాసేపటికే ఔటయ్యాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కామెరూన్ గ్రీన్, రోవమన్ పావెల్ ఆదుకున్నారు. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడని గ్రీన్ ఈ మ్యాచ్ లో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

పావెల్ ఔట్ అయిన తర్వాత గ్రీన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. మొత్తం 79 పరుగులతో కేకేఆర్ స్కోరును 180కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్ (9) తో కలిసి ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. అటు కేకేఆర్ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ (1) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. రమణ్‌దీప్ సింగ్ (17), సునీల్ నరైన్ (0), కార్తీక్ త్యాగి (6) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

నిజానికి ఒక దశలో 220 పరుగుల వరకూ స్కోర్ చేస్తుందనుకున్న కోల్ కతా తక్కువ స్కోరుకే పరిమితమవడానికి కామెరూన్ గ్రీన్ నే కారణంగా చెప్పాలి. ధాటిగా ఆడాల్సిన స్లాగ్ ఓవర్లలో పలు డాట్ బాల్స్ ఆడడం, సింగిల్స్ కే పరిమితం కావడం కొంపముంచింది.

ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్న గ్రీన్ తర్వాత అదే జిడ్డు బ్యాటింగ్ తో కోల్ కతా స్కోరు తక్కువకే పరిమితమవడానికి  కారణమయ్యాడు. కాగా గుజరాత్(Gujarat Titans) బౌలర్లలో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు.సిరాజ్, అశోక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా… ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

Gujarat Titans
Gujarat Titans

181 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(22), గిల్ తో కలిసి తొలి వికెట్ కు 5.1 ఓవర్లలో 57 పరుగులు జోడించాడు. తర్వాత బట్లర్ , గిల్ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి వచ్చీరాగానే బట్లర్ సిక్సర్, ఫోర్ బాదాడు. అటు గిల్ కూడా దూకుడు పెంచడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది.

బట్లర్ (25) రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ (13)తో కలిసి గిల్ 46 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో గుజరాత్ విజయం ఖాయమైంది. అయితే విజయానికి 22 పరుగుల దూరంలో గిల్ 86 (8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్, తెవాటియా, షారూఖ్ ఖాన్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మరో 2 బంతులు మిగిలుండగా విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

Strait of Hormuz : హార్మూజ్ జలసంధి తెరిచిన ఇరాన్..ధన్యవాదాలు చెప్పిన ట్రంప్

Related Articles

Back to top button