Just SportsLatest News

IND vs AFG : పట్టుబిగించిన టీమిండియా..ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ ఎదురీత

IND vs AFG : తొలిరోజే 368 పరుగుల స్కోరు సాధించిన భారత్ రెండోరోజు దూకుడుగా ఆడింది

IND vs AFG

ఐపీఎల్ మూడ్ నుంచి త్వరగానే బయటకొచ్చిన టీమిండియా ఆఫ్ఘనిస్థాన్(IND vs AFG) తో ఏకైక టెస్టులో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్ లో పరుగుల వరద పారించి భారీస్కోరు నమోదు చేయగా.. తర్వాత బౌలర్లు చెలరేగిపోయారు. అరంగేట్రం చేసిన స్పిన్ ఆల్ రౌండర్ మానవ్ సుతార్ మూడు వికెట్లతో ఆప్ఘనిస్థాన్ ను దెబ్బకొట్టాడు.

ప్రసిద్ధ కృష్ణ కూడా రాణించడంతో ఆప్ఘన్ టీమ్ ఎదురీదుతోంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్న వేళ ఆప్ఘనిస్థాన్ ఫాలో ఆన్ గండం దాటడం కష్టంగానే కనిపిస్తోంది. తొలిరోజే 368 పరుగుల స్కోరు సాధించిన భారత్ రెండోరోజు దూకుడుగా ఆడింది. వీలైనంత వేగంగా పరుగులు చేసే లక్ష్యంతో బ్యాటర్లు ధాటిగా ఆడారు. శుభమన్ గిల్ 126 (15 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటవగా..పంత్ 81 (6 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 169 పరుగులు జోడించారు.

జురెల్ (19) త్వరగానే ఔటైనా ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్ కీలక ఇన్నింగ్స్ లు ఆడారు, గత కొంతకాలంగా బ్యాట్ తోనూ ఆకట్టుకుంటున్న వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

మానవ్ సుతార్ తో కలిసి 54 , సిరాజ్ తో కలిసి 30 , కుల్దీప్ యాదవ్ తో కలిసి 24 పరుగులు జోడించాడు. వాషింగ్టన్ సుందర్ 52 ( 5 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా.. మానవ్ సుతార్ 28 రన్స్ కు ఔటయ్యాడు. చివర్లో సిరాజ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. వీరి దూకుడుతోనే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 564 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.

IND vs AFG
IND vs AFG

ఆప్ఘన్ బౌలర్లలో సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ ఆరంభం నుంచే తడబడింది. ఈ మ్యాచ్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్ తో దెబ్బకొట్టాడు. ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16)ను ఔట్ చేయడం ద్వారా తన కెరీర్‌లో తొలి టెస్ట్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

కాసేపటికే డేంజరస్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (12)ను కూడా పెవిలియన్ కు పంపాడు. , రెండో రోజు ఆట ముగిసే సమయంలో అఫ్సర్ జజాయ్ ను కూడా ఔట్ చేసి మూడు వికెట్లు సాధించాడు. అటు పేసర్ ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయడంతో ఆప్ఘనిస్థాన్ 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉన్న ఆప్ఘన్(IND vs AFG) టీమ్ ఫాలో ఆన్ గండం దాటితే అద్భుతమే.

Bigg Boss 10 : బిగ్‌బాస్ 10 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..హోస్ట్ ఎవరు? ఎప్పటి నుంచి సందడి చేయనుంది?

Related Articles

Back to top button