Just SportsLatest News

IND VS SA T20: హార్థిక్ , గిల్ రీఎంట్రీ.. టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఇదే

IND VS SA T20: ఇదిలా ఉంటే గిల్, హార్దిక్ జట్టులోకి రావడంతో జైస్వాల్, నితీష్ కుమార్రెడ్డిలపై వేటు పడింది.

IND VS SA T20

సంచలన నిర్ణయాలు ఏమీ లేవు.. వచ్చే ప్రపంచకప్ కు కోసం దాదాపుగా టీ20 టీమ్ ను రెడీ చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ కోసం 15 మందితో జట్టును ప్రకటించింది. ఊహించినట్టుగానే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మెడనొప్పి కారణంగా టెస్ట్ సిరీస్ మధ్యలోనే తప్పుకున్న గిల్ తర్వాత వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. మెడనొప్పి నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిటినెస్ సాధించే క్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో శ్రమిస్తున్నాడు.

టీ20(IND VS SA T20) సిరీస్ కు గిల్ ను ఎంపిక చేసినప్పటికీ ఫిటినెన్ క్లియరెన్స్ వస్తేనే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ ఫిట్ నెస్ సాధించకుంటే మాత్రం వచ్చే సిరీస్ కే అందుబాటులో ఉంటాడు. అలాగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆసియాకప్ సందర్భంగా గాయపడిన పాండ్యా అప్పటి నుంచీ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే ఫిట్నెస్ క్లియర్ చేసిన ఆ ఆల్ రౌండర్ ప్రస్తుతం నయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్ లోనే పంజాబ్ పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు.

IND VS SA T20
IND VS SA T20

ఇదిలా ఉంటే గిల్, హార్దిక్ జట్టులోకి రావడంతో జైస్వాల్, నితీష్ కుమార్రెడ్డిలపై వేటు పడింది. అలాగే కీవర్లుగా నంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. ఆల్ రౌండర్ కోటాతో పాండ్యాతో పాటు శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు. షేన్ విభాగంలో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వచ్చాడు. అలాగే అర్షదీప్సింగ్, హర్షిత్ రాణా పేనర్లుగా ఎంపికయ్యారు. సౌతాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ డిసెంబర్ 9 నుంచి మొదలవుతుంది. టీ ట్వంటీ సిరీస్ కు కటక్ , ముల్లాన్ పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి.

IND VS SA T20
IND VS SA T20

సౌతాఫ్రికాతో టీ20(IND VS SA T20)లకు భారత జట్టు

నూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), గిల్ (చైన్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ నుందర్, హార్దిక్ పాండ్యా, నంజూ శాంసన్ (కీవర్), జితేశ్ శర్మ (కీపర్), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ , అక్షర్ పటేల్.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button