IND vs ZIM : సిరీస్ విజయంపై కన్ను..నేడు జింబాబ్వేతో రెండో టీ20

IND vs ZIM : జింబాబ్వేతో రెండో టీ20 గెలిచి సారథిగా తొలి సిరీస్ గెలుపును అందుకోవాలని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉవ్విళ్లూరుతున్నాడు.

IND vs ZIM

వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని రుచి చూసిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. జింబాబ్వేతో రెండో టీ20 గెలిచి సారథిగా తొలి సిరీస్ గెలుపును అందుకోవాలని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉవ్విళ్లూరుతున్నాడు.

బౌలర్లు, బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో భారత్ గెలుపును అడ్డుకోవడం జింబాబ్వేకు కష్టమే అని చెప్పొచ్చు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మొదటి టీ20లో అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దీని ద్వారా ఇంగ్లాండ్ టూర్ వైఫల్యాలకు తెరదించాడు.

హరారే పిచ్‌పై గతంలో ఆడిన అనుభవం కూడా వైభవ్‌కు బాగా కలిసొచ్చింది. సూర్యవంశీ ఇదే జోరు కొనసాగిస్తే మరో ఘన విజయం భారత్ ఖాతాలో పడడం ఖాయం. అలాగే మరికొన్ని రికార్డులు కూడా వైభవ్ అందుకోవడం కూడా ఖాయమే. అభిషేక్ శర్మ మాత్రం తొలి టీ20లో నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ రాణించారు. మిగిలిన బ్యాటర్లకు అవకాశం దక్కలేదు.

మయాంక్ యాదవ్ పేస్ ఎటాక్‌ను లీడ్ చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఈ పేసర్ తన రీఎంట్రీని ఘనంగానే చాటుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అతనికి తోడుగా ప్రిన్స్ యాదవ్ కూడా సత్తా చాటాడు. కానీ అశోక్ శర్మ అరంగేట్రంలో భారీగా పరుగులిచ్చేశాడు. అతనికి మరో అవకాశం ఇస్తారా లేక యశ్ ఠాకూర్‌ను ఆడిస్తారా అనేది చూడాలి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు.

మరోవైపు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మొదటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన ఆతిథ్య జట్టు, సిరీస్‌ను కాపాడుకోవాలంటే బ్యాటింగ్‌లో చాలా మెరుగవ్వాల్సి ఉంది. గత మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు బౌండరీలు కొట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

దీనివల్ల బంతి కొత్తగా ఉండి ఎక్కువ స్వింగ్ అయింది. వెస్లీ మాధేవెరె, తడివనషే మరుమానీ రాణించడంతో జట్టు కనీసం 125 పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లు పూర్తి ఫామ్‌లో ఉండడంతో ఈ మ్యాచ్ జింబాబ్వే బ్యాటర్లకు కఠిన పరీక్షగా చెప్పొచ్చు.

IND vs ZIM

సికందర్ రజాతో పాటు తొలి టీ20లో ఆకట్టుకున్న మాధేవెరెపై అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ న్గారవా కీలకం కానున్నారు. ఇదిలా ఉంటే హరారే మైదానం సంప్రదాయకంగా స్లో పిచ్. ఇక్కడ బంతి బ్యాట్‌పైకి ఈజీగా రాదు, కాబట్టి భారీ షాట్లు కొట్టడం కష్టం.

కట్టర్లు మరియు లెంగ్త్ బంతులు వేసే పేసర్లకు, స్పిన్నర్లకు హరారే పిచ్ బాగా సహకరిస్తుంది. టాస్ విషయానికొస్తే మొదట బౌలింగ్ చేసిన జట్టుకు ఇక్కడ రికార్డులు బాగున్నాయి. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Block Chain Technology : మీ భూమి ఇక వంద శాతం సేఫ్.. బ్లాక్‌ చెయిన్ ప్రొటెక్షన్‌ నిజంగానే రక్షణ ఇస్తుందా?

Exit mobile version