IND vs ZIM : దంచికొట్టిన భారత బ్యాటర్లు..టీ20 వరల్డ్ కప్ లో రికార్డ్ స్కోరు
IND vs ZIM : సూపర్ 8 స్టేజ్ ను ఓటమితో ఆరంభించి సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఎట్టకేలకు పుంజుకుంది. జింబాబ్వేపై చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రికార్డుల మోత మోగించింది

IND vs ZIM
సూపర్ 8 స్టేజ్ ను ఓటమితో ఆరంభించి సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఎట్టకేలకు పుంజుకుంది. జింబాబ్వేపై ( IND vs ZIM) చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రికార్డుల మోత మోగించింది.
బ్యాటర్లందరూ తలో చేయి వేసిన వేళ భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్ లోనే రికార్డు స్కోరు సాధించింది. ఫామ్ లో లేని బ్యాటర్లందరూ ఈ మ్యాచ్ లో అదరగొట్టేశారు. తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ 24 పరుగులకే ఔటైనా…అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. వరుస వైఫల్యాలతో మొన్నటి వరకూ తీవ్ర ఒత్తిడిలో కనిపించిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా క్రీజులో కుదురుకున్న తర్వాత ఈ యువ ఓపెనర్ విధ్వంసం సృష్టించాడు.
తన సహజశైలి బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అలాగే వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 38 రన్స్ చేయగా.. 13 బంతుల్లోనే 33 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. చివర్లో క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా దెబ్బకు జింబాబ్వే బౌలర్లు బెంబేెలెత్తిపోయారు. వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డ పాండ్యా కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు.

అతనికి తోడుగా తిలక్ వర్మ సైతం చెలరేగిపోయాడు. గత మ్యాచ్ లలో మంచి ఆరంభాలు లభించినా పెద్ద స్కోరు చేయలేకపోయిన తిలక్ వర్మ 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది.
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇదే అత్యధిక స్కోరు. అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ కు ఇదే హయ్యెస్ట్ స్కోరు. అలాగే ఈ మ్యాచ్ లో భారత్ 17 సిక్సర్లు కొట్టింది. దీని ద్వారా 2024లో ఆసీస్ పై కొట్టిన 15 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే హార్థిక్ , తిలక్ వర్మ 31 బంతుల్లోనే 84 పరుగుల పార్టనర్ షిప్ కూడా రికార్డే.
మొత్తం మీద భారత బ్యాటర్ల దెబ్బకు జింబాబ్వే(IND vs ZIM) బౌలర్లు ఒక్కొక్కరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు,



