Just SportsLatest News

IND vs ZIM : టీమిండియాకు మరో అగ్నిపరీక్ష.. జింబాబ్వేతోనూ డేంజరే

IND vs ZIM : కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్, తన సారథ్యంలో తొలి సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఛాలెంజ్ కానుంది.

IND vs ZIM

భారత క్రికెట్ జట్టు యూకే టూర్ ఘోరపరాజయాలతో ముగిసింది. భారీ అంచనాలతో అక్కడకు వెళ్లిన టీమిండియా పూర్తిగా నిరాశపరిచింది. మొదట పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం చవిచూసింది. ఐర్లాండ్‌పై భారత జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు.

తర్వాత ఇంగ్లాండ్ గడ్డపైనా అదే చెత్త ఆటతీరు. ఫలితంగా టీ20 సిరీస్ లో 0-4తో ఘోరపరాభవం. పొట్టి క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టు ఇలా వరుసగా రెండు సిరీస్‌లలో వైట్ వాష్ అవమానం ఎదుర్కొంటుందని ఎవ్వరూ అనుకోలేదు. పోనీ వన్డే సిరీస్‌లోనైనా గాడిన పడతారా అంటే అదీ జరగలేదు.

తొలి వన్డే గెలిచి సిరీస్‌పై ఆశలు రేకెత్తించిన టీమిండియా తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి సిరీస్‌ను సమర్పించుకుంది. దీంతో యూకే టూర్‌లో 10 మ్యాచ్‌లకు గానూ కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ టూర్ ముగిసిన నాలుగు రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేతో(IND vs ZIM) టీ20 సిరీస్‌కు రెడీ అయింది.

స్వదేశం నుంచి కొంతమంది యువ ఆటగాళ్లు తాత్కాలిక కోచ్ లక్ష్మణ్‌తో కలిసి జింబాబ్వేలో ల్యాండ్ అయ్యారు. అటు వన్డే జట్టులో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ లండన్ నుంచి నేరుగా హరారేకు బయలుదేరారు.

నిజం చెప్పాలంటే ఈ సిరీస్ కెప్టెన్‌గా శ్రేయాస్‌కు అగ్నిపరీక్ష కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జింబాబ్వేను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆ జట్టు స్వదేశంలో బలమైనదే. పైగా టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం. ఈ విషయం ఇటీవలే ఐర్లాండ్ జట్టు కూడా క్రికెట్ ప్రపంచానికి రుజువు చేసింది. దీంతోనే జింబాబ్వేతో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అంచనా.

IND vs ZIM
IND vs ZIM

కాగా రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో, వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టును నడిపించనున్నారు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన కొంతమంది కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది.

అటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్, తన సారథ్యంలో తొలి సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఛాలెంజ్ కానుంది. హర్ష్ దూబే, యశ్‌ ఠాకూర్‌, అశోక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ లాంటి ప్లేయర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Rashi Phalalu : ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం..ఆ రాశి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ..

Related Articles

Back to top button