Just SportsLatest News

India Bowling : తేలిపోయిన భారత్ బౌలర్లు.. లంక ఎలెవన్ భారీస్కోరు

India Bowling : తొలి టెస్ట్ కంటే ముందు లంక ఎలెవన్‌తో ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మన బౌలర్లు తేలిపోయారు.

India Bowling

శ్రీలంక పర్యటన అంత ఈజీ కాదని వార్మప్ మ్యాచ్‌తోనే భారత్‌కు అర్థమవుతోంది. తొలి టెస్ట్ కంటే ముందు లంక ఎలెవన్‌తో ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మన బౌలర్లు తేలిపోయారు. స్పిన్నర్లు రాణించినా.. లంక జోరును అడ్డుకోలేకపోయారు. దీంతో మొదటిరోజే లంక ఎలెవన్ భారీస్కోరు సాధించింది.

టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ముందురోజు నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్‌కు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు.

తొలిరోజు ఆటలో గిల్ దిగడని , మెడికల్ టీమ్ అతని గాయాన్ని పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ముందుగానే తెలిపింది. కాగా ఇటు భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో లంక ఎలెవన్ బ్యాటర్లు స్వేఛ్ఛగా ఆడారు. తొలి వికెట్‌కు 20 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దీనిలో భాగంగానే నిశాంత్ మధుష్క, రవిందు హాఫ్ సెంచరీలు సాధించారు. నిశాంత్ 66 పరుగుల దగ్గర రనౌట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత బ్యాటర్లు కూడా భారీస్కోర్లు సాధించకపోయినా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. రెండో వికెట్‌కు సూర్య బండార , రవిందు 61 పరుగులు జోడంచారు. రవిందు (71), సూర్య బండార (35), రత్నాయకే (39), విక్రమ్ సింఘే (31) పరుగులతో రాణించారు.

తర్వాత కెప్టెన్ సోనాల్ దినుషా హాఫ్ సెంచరీ చేయగా, రమేష్ మెండిస్ 32 పరుగులతో సహకారమందించాడు. దీంతో శ్రీలంక ఎలెవన్ స్కోరు దూకుడుగానే సాగింది. మూడో సెషన్‌లో భారత స్పిన్నర్లు పుంజుకోవడంతో లంక ఎలెవన్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

India Bowling
India Bowling

తొలిరోజు ఆటముగిసే సమయానికి లంక ఎలెవన్ 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నువాంత (9), సుధీర (1) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు(India Bowling) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పెద్దగా అనుభవం లేని లంక బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.

స్పిన్నర్లు పుంజుకోకుంటే మాత్రం ఆ జట్టు మరింత భారీ స్కోరు చేసేది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ , సారంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయారు. అటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు పడగొట్టగా, గుర్నూర్ బ్రార్ 1 వికెట్ తీసాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా రూపొందించడంపై ఇప్పటికే భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో షాకింగ్ నిజాలు ..మాస్టర్ మైండ్స్‌తో ప్రూఫ్ రీడర్ల స్కెచ్

Related Articles

Back to top button