Just SportsLatest News

IPL : ఐపీఎల్ 2026 పై కీలక అప్ డేట్…మార్చి 12న షెడ్యూల్ విడుదల

IPL : టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిపోవడంతో అభిమానులు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రియినర్ లీగ్ 19వ సీజన్ కు ఇంకా కొద్దిరోజులే మిగిలి ఉంది.

IPL

టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిపోవడంతో అభిమానులు ఇప్పుడు ఐపీఎల్(IPL) సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రియినర్ లీగ్ 19వ సీజన్ కు ఇంకా కొద్దిరోజులే మిగిలి ఉంది. అయితే ఇప్పటి వరకూ బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేయలేడు. తాజాగా దీనికి సంబంధించి బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా కీలక ప్రకటన చేశారు. మార్చి 12న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

తొలి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తామని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ సారి ఐపీఎల్(IPL) షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. తమిళనాడు, బెంగాల్, అసోంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ తేదీలతో లీగ్ షెడ్యూల్ క్లాష్ కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల సంఘం ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయకపోవడంతో ఈ లోపు తొలి 20 రోజులకు సంబంధించిన మ్యాచ్‌ల వివరాలను బీసీసీఐ ప్రకటించనుంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోలింగ్, కౌంటింగ్ జరిగే తేదీల్లో సెక్యూరిటీ సమస్యలు రానుండడంతో అక్కడ మ్యాచ్ లు లేకుండా బీసీసీఐ ప్లాన్ చేసింది. పైగా ఈ సారి పలు ఫ్రాంచైజీలు ఒకటి కంటే ఎక్కువ గ్రౌండ్స్ లో మ్యాచ్ లు ఆడబోతున్నాయి. ఇది కూడా షెడ్యూల్ ఖరారుకు టైమ్ తీసుకునేలా చేసింది. ఆర్సీబీ తమ హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడనుండగా.. మిగిలిన మ్యాచ్ లను రాయ్ పూర్ లో ఆడేందుకు నిర్ణయించుకుంది.

IPL
IPL

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులు ఐపీఎల్ విదేశీ ప్లేయర్స్ పాల్గొనడంపై ప్రభావం చూపే అవకాశముంది. విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో విదేశీ ఆటగాళ్లను భారత్ కు తీసుకొచ్చే అంశంపై బీసీసీఐ, ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. భారత్ కు వచ్చేందుకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ప్లేయర్స్ దుబాయ్ స్టాప్ గానే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం దుబాయిలో పరిస్థితి దారుణంగా ఉంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు సన్నద్దమవుతున్నాయి. తమ ప్లేయర్స్తో ట్రైనింగ్ క్యాంపులు కూడా మొదలుపెట్టేశాయి. కాగా ఐపీఎల్ మార్చి 28 నుంచి మే 31 వరకూ దేశవ్యాప్తంగా 14 వేదికల్లో జరగనుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button