Just SportsLatest News

KKR vs CSK : కోల్ కతా బోణీ కొట్టేనా ?..చెన్నైతో కీలక మ్యాచ్

KKR vs CSK : ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడేసాయి

KKR vs CSK

ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడేసాయి. ప్రతీ జట్టు కనీసం ఒక విజయాన్ని అందుకున్నా సరే కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. పంజాబ్ తో మ్యాచ్ వర్షం రద్దవడంతో పాయింట్లు పంచుకున్నా.. పేలవమైన బౌలింగ్ తో చేజేతులా మ్యాచ్ లు పోగొట్టుకుంటోంది.

ఇప్పుడు తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న కోల్ కతా చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK)తో తలపడబోతోంది. చెపాక్ స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో సీఎస్కేనే ఫేవరెట్. ఎందుకంటే గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి పాయింట్ల ఖాతా తెరిచిన చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK) ఫామ్ అందుకుంది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు.

మొదట మూడు మ్యాచ్ లలో విఫలమైన సంజూ ఢిల్లీపై మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే కూడా దుమ్మురేపుతున్నారు. మిగిలిన బ్యాటింగ్ లో సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ కూడా రాణిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కు తిరుగుండదు.

అటు బౌలింగ్ లో జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్ , గుర్జపనీత్ సింగ్ ఉండగా.. ఏకైక స్పిన్నర్ నూర్ అహ్మద్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ధోనీ లేకపోవడం కూడా చెన్నైకి మైనస్ గా మారింది. మోకాలి గాయంతో దాదాపు 3-4 వారాలు దూరమవడంతో ఈ మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండడం లేదు.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ కు సీజన్ ఆరంభం నుంచీ ఏదీ కలిసిరావడం లేదు. కీలక ఆటగాళ్ళు గాయాలతో దూరమవడం, జట్టులో ఉన్న ఆటగాళ్లు పేలవ ఫామ్ తో సతమతమవడం ఇబ్బందిగా మారింది. కెప్టెన్ రహానే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా మంచి ఆరంభాన్ని ఇస్తే భారీస్కోరు ఖాయం, అన్నింటికంటే ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ ఇంకా పూర్తిస్థాయి సత్తా చూపించలేదు.

KKR vs CSK
KKR vs CSK

గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రీన్ బ్యాట్‌తో రాణించాడు. బంతితో ఒక వికెట్ తీసినా పరుగులు మాత్రం సమర్పించుకున్నాడు. అయితే ఫిట్ నెస్ సాధించి బౌలింగ్ చేస్తుండడం కొంత ఊరట. మిగిలిన వారిలో రింకూ సింగ్, రఘువంశీ, రోవ్ వన్ పావెల్ , రమణ్ దీప్ సింగ్ లతో బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది.

కేవలం బౌలింగ్ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. సునీల్ నరైన్, నవదీప్ శైని, కార్తీక్ త్యాగి నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్ లో తొలి విజయం సాధించాలంటే కేకేఆర్ బౌలింగ్ కూడా పూర్తిగా గాడిన పడాల్సిందే. గత రికార్డుల్లో కోల్ కతాపై చెన్నై(KKR vs CSK)దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 32 సార్లు తలపడితే  20 మ్యాచ్ లలో చెన్నై గెలిచింది. 11 మ్యాచ్ లలో కేకేఆర్ విజయం సాధించింది. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.

SRH : ఉప్పల్ లో ప్రఫుల్ షో…రాజస్థాన్ జోరుకు బ్రేక్

Related Articles

Back to top button