Lionel Messi : గ్రాండ్ విక్టరీతో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి భావోద్వేగ వీడ్కోలు..మైదానంలో 85 వేల మంది కన్నీళ్లు..

Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ మెజీషియన్‌గా పిలుచుకునే లియోనెల్ మెస్సి తన 21 ఏళ్ల మైండ్ బ్లోయింగ్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు .. భావోద్వేగాల మధ్య వీడ్కోలు పలికాడు.

Lionel Messi

ఫుట్‌బాల్ సామ్రాజ్యంలో ఒక గోల్డెన్ అధ్యాయం ముగిసింది. మైదానంలో బాల్‌ని కాలితో తాకితే చాలు, గాల్లోకి మ్యాజిక్ వదిలే అర్జెంటీనా ఫుట్‌బాల్ మెజీషియన్‌గా పిలుచుకునే లియోనెల్ మెస్సి(Lionel Messi) తన 21 ఏళ్ల మైండ్ బ్లోయింగ్ ఇంటర్నేషనల్ కెరీర్‌కు .. భావోద్వేగాల మధ్య వీడ్కోలు పలికాడు.

బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ స్టేడియంలో బెనిన్‌తో జరిగిన స్నేహపూరిత మ్యాచ్, అర్జెంటీనా ఐకానిక్ బ్లూ అండ్ వైట్ జెర్సీలో మెస్సీకి(Lionel Messi) లాస్ట్ మ్యాచ్‌గా మిగిలిపోయింది. సుమారు 85వేల మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ది లాస్ట్ టాంగో పేరుతో జరిగిన ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా 3-0 తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. తన చివరి మ్యాచ్‌లో కూడా ఒక క్లాసిక్ గోల్ కొట్టడంతో పాటు మరో 2 గోల్స్‌కు అసిస్ట్ అందించి ఆటను మరచిపోలేని మైలురాయిగా మలిచాడు మెస్సి.

ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెస్సి(Lionel Messi) ప్రతీ మూమెంట్‌ ఎమోషనల్ అవుతూనే కనిపించాడు. టీమ్ అంతా బస్సులో స్టేడియానికి వెళుతున్నప్పుడు, జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు, ఆట ముగిసిన తర్వాత కూడా అతని కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉండటం అభిమానులను కదిలించింది.

తన గ్లోబల్ జర్నీలో ఇది అత్యంత బాధాకరమైన రోజుల్లో ఒకటని, వీలైతే తన లైఫ్ లాంగ్ అర్జెంటీనా కోసం ఆడుతూనే ఉండాలని ఉందని మెస్సి చెప్పిన మాటలు స్టేడియంలోని ప్రతీ అభిమాని హార్ట్‌ను తడిమాయి. గ్రాండ్ ఫేర్‌వెల్ ఇవ్వడానికి చేసిన అదిరిపోయే ఏర్పాట్లలో భాగంగా.. మ్యాచ్ 10 వ నిమిషం కాగానే , అతని ఐకానిక్ నెంబర్ 10 జెర్సీకి రెస్పెక్ట్ ఇస్తూ స్టేడియంలో అందరూ లేచి నిలబడి క్లాప్స్‌తో హోరెత్తించారు.

గ్రాసియాస్ అనే లెటర్స్‌తో భారీ జెర్సీని ప్రదర్శిస్తూ బాణసంచా లైటింగ్స్ మధ్య వేడుకలను నిర్వహించారు. 2022 వరల్డ్ కప్ గెలిచిన విన్నింగ్ టీమ్ మెంబర్స్ అంతా ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వచ్చి తమ కెప్టెన్‌కు ఘన నివాళిని అర్పించగా, మెస్సి తన కుమారులతో కలిసి స్టేడియంలోకి నడిచి రావడం హైలైట్‌గా నిలిచింది.

Lionel Messi

అర్జెంటీనా తరఫున రికార్డు రేంజ్‌లో 208వ మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల మెస్సి, ఈ చివరి పోరులో నికోలస్ ఒటమెండి తొలి గోల్ కొట్టడానికి, అలాగే యంగ్ ప్లేయర్ నికో పాజ్‌కి.. మరో గోల్ కొట్టడం కోసం అదిరిపోయే అసిస్ట్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత 71వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని ధీటుగా గోల్‌గా మార్చి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో తన 126వ గోల్‌ను అకౌంట్‌లో వేసుకున్నాడు.

2022లో తన కెప్టెన్సీలోనే అర్జెంటీనాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టడంతో పాటు రెండు కోపా అమెరికా కప్పులను అందించిన ఈ ఫుట్‌బాల్ లెజెండ్..దేశానికి ఆడటం ఆపేసినా సరే క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం రచ్చ చేస్తూనే ఉంటాడు. అమెరికాలోని ఇంటర్ మయామి క్లబ్‌తో 2028 వరకు మెస్సికి కాంట్రాక్ట్ ఉండటంతో ఫ్యాన్స్ అక్కడ అతని మ్యాజిక్‌ను చూడొచ్చు. నేషనల్ జెర్సీ విప్పేసినా, కోట్లాది మంది ఫుట్‌బాల్ లవర్స్ గుండెల్లో లెజెండ్ మెస్సి పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందనేది మాత్రం నిజం.

🇦🇷 Lionel Messi’s Argentina career stats:

Lionel Messi : చివరి వరల్డ్ కప్ ఆడేసిన మెస్సీ..అర్జెంటీనా దిగ్గజం కెరీర్ ముగిసినట్టేనా ?

↑
Exit mobile version