Just SportsLatest News

Lucknow Super Giants : ముకుల్ అద్భుతః…ఓడే మ్యాచ్ గెలిచిన లక్నో

Lucknow Super Giants : ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కథ మారలేదు. ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు సరైన ఆరంభం లభించలేదు

Lucknow Super Giants

ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కథ మారలేదు. ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులకే ఔటయ్యాడు. అయితే ఈ ఔట్ వివాదాస్పదమైంది. డీప్ థర్డ్ మ్యాన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న దిగ్వేష్ రాథీ .. పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ కంప్లీట్ చేశాడు.

అయితే బంతి చేతిలో ఉన్నసమయంలోనే రాథీ.. పాదం బౌండరీ లైన్‌కు తాకినట్లు కనిపించింది. ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్‌ను నేరుగా అవుట్‌గా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

కెప్టెన్ రహానే, రఘువంశీ తర్వాత ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 84 పరుగులు జోడించారు. తన ఫామ్ కంటిన్యూ చేసిన రహానే 24 బంతుల్లో 41 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. రఘువంశీ 45, రింకూ సింగ్ 4 పరుగులకే ఔటవడంతో కోల్ కతా కష్టాల్లో పడినట్టు కనిపించింది.

ఈ దశలో కామెరూన్ గ్రీన్, రోవ్ మన్ పావెల్ ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచారు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న గ్రీన్ ఎట్టకేలకు బ్యాట్ కు పనిచెప్పాడు. ఆరంభంలో చాలా సేపు నిదానంగా ఆడిన ఈ ఆసీస్ క్రికెటర్ తర్వాత గేర్ మార్చాడు.పావెల్ తో కలిసి ఐదో వికెట్ కు కేవలం 40 బంతుల్లోనే 70 పరుగులు జోడించాడు.

అటు పావెల్ కూడా మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 32, పావెల్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. లక్నో(Lucknow Super Giants )బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్థ్ , దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

182 పరుగుల లక్ష్యఛేదనలో లక్నోకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు మార్కరమ్, మిఛెల్ మార్ష్ తొలి వికెట్ కు 4.1 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కేకేఆర్ బౌలర్ వైభవ్ ఆరోరా ఒకే ఓవర్లో వీరిద్దరినీ పెవిలియన్ కు పంపించాడు. మొదట మార్కరమ్ ను ఔట్ చేసిన వైభవ్ తర్వాత మార్ష్ వికెట్ కూడా తీసాడు. ఇక్కడ నుంచి లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది.పంత్ (10), పూరన్ (13), సమద్ (2) పరుగులకే ఔటవడంతో లక్నో ఓటమి ఖాయమనుకున్నారు.

Lucknow Super Giants
Lucknow Super Giants

16 ఓవర్లకు లక్నో స్కోరు 128/7.. ఇంకా 24 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే ముకుల్ చౌదరి అద్భుత పోరాటంతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. తానే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ స్కోరు పెంచుతూ వెళ్లాడు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా కామెరూన్ గ్రీన్ కోల్ కతా కొంపముంచాడు. ముకుల్ చౌదరిని తక్కువ అంచనా వేసిన గ్రీన్ బౌన్సర్లతో ఇబ్బందిపెడతామని ప్రయత్నించాడు.

అయితే ఎదురుదాడికి దిగిన ముకుల్ 19వ ఓవర్ లో 16 పరుగులు రాబట్టాడు. దీనిలో రెండు సిక్సర్లున్నాయి. చివరి ఓవర్ లో సిక్సర్ తర్వాత వరుసగా డాట్ బాల్స్ రావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఐదో బంతికి సిక్సర్ కొట్టిన ముకుల్ లక్నోకు(Lucknow Super Giants) విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో గెలిచే మ్యాచ్ లో కోల్ కతా ఓడిపోయింది. ఈ సీజన్ లో కోల్ కతాకు ఇది మూడో ఓటమి. అటు లక్నోకు వరుసగా రెండో విజయం.

David Miller : సింగిల్ తీయని మిల్లర్…మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా ?

Related Articles

Back to top button