Mccullum : బజ్‌బాల్ శకానికి ముగింపు..టెస్ట్ కోచ్‌గా తప్పుకున్న మెక్‌కల్లమ్

Mccullum : బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్దిరోజుల్లోనే మెక్‌కల్లమ్ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Mccullum

ఇంగ్లాండ్ క్రికెట్‌లో బజ్‌బాల్ శకానికి తెరపడింది. టెస్ట్ క్రికెట్‌లో దూకుడుగా ఆడుతూ ఎన్నో సంచలన విజయాల వెనుక ఉన్నహెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ రెడ్ బాల్ ఫార్మాట్‌లో తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ బోర్డుకు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ రాజీనామా చేశారు.

ఇటీవలే బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే మెక్‌కల్లమ్(Mccullum) కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. 2022 మే నెలలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

మెక్‌కల్లమ్(Mccullum) నిక్‌నేమ్ అయిన బజ్ ఆధారంగా ఈ విప్లవాత్మక వ్యూహానికి బజ్‌బాల్ అని పేరు వచ్చింది. టెస్ట్ క్రికెట్ అంటే సాధారణంగా డిఫెన్సివ్‌గా ఆడుతూ వికెట్లు కాపాడుకోవడం.

కానీ బజ్‌బాల్ వ్యూహంలో ఫలితం గురించిన భయం లేకుండా, వన్డే లేదా టీ20 తరహాలో మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఓవర్‌కు 4.5 నుంచి 5 కంటే ఎక్కువ రన్ రేట్‌తో వేగంగా పరుగులు సాధించడం ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ బజ్‌బాల్ వ్యూహంతోనే ఇంగ్లీష్ టీమ్ టెస్టుల్లో ఎన్నో సంచలన విజయాలను అందుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించడం, భారత్‌పై ఎడ్జ్‌బాస్టన్‌లో రికార్డు స్థాయిలో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం , పాకిస్థాన్ పర్యటనలో చారిత్రాత్మక రీతిలో 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం వంటివి బజ్‌బాల్ వ్యూహంతో వచ్చినవే. అయితే ఈ దూకుడు వ్యూహం కొన్నిసార్లు ఘోర పరాజయాలకు కారణమైంది.

గతేడాది భారత పర్యటనలో టర్నింగ్ పిచ్‌లపై కూడా బజ్‌బాల్ ఆడబోయి ఇంగ్లాండ్ 1-4తో ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో 1-4తో ఘోరంగా ఓడిపోయింది. ఇటీవల కివీస్ చేతిలోనూ టెస్ట్ సిరీస్ కోల్పోయింది.

Mccullum

టెస్ట్ జట్టుకు కోచింగ్ ఇవ్వడం అంటే తనకు చాలా ఇష్టమనీ, స్టోక్స్, తాను కలిసి సాధించిన వాటిపై గర్వపడుతున్నానని మెక్‌కల్లమ్ చెప్పారు. ఈ కాలంలో ఎన్నో అద్భుత విజయాలు, కొన్ని కఠిన ఫలితాలను కూడా చూసామన్నారు.

టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన దృష్టి వైట్ బాల్ జట్లకు కోచింగ్ ఇవ్వడంపై ఉంటుందని మెక్‌కల్లమ్ తెలిపారు. కాగా మెక్‌కల్లమ్ ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్లకు కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Nagarjuna Yadav Arrest : లైవ్ డిబేట్ కామెంట్స్ ఎఫెక్ట్.. నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

Exit mobile version