Just SportsLatest News

PBKS vs LSG : పంజాబ్ కింగ్స్ కు ఎదురుందా ?..లక్నోకు మరో సవాల్

PBKS vs LSG : ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ముల్లాన్ పూర్ వేదికగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది

PBKS vs LSG

ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ముల్లాన్ పూర్ వేదికగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్(PBKS vs LSG) తో తలపడనుంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఒక్క ఓటమి లేకుండా 9 పాయింట్ల అగ్రస్థానంలో కొనసాగుతోంది.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, కీలక బ్యాటర్లందరూ ఫామ్ లో ఉండడం పంజాబ్ కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య సూపర్ మెరుపు ఆరంభాలను ఇస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. అటు టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ, ఇటు వ్యక్తిగతంగానూ దుమ్మురేపుతున్నాడు.

అతనితో పాటు కూపర్ కన్నోలీ, శశాంక్ సింగ్, స్టోయినిస్ లాంటి బ్యాటర్లు కూడా పంజాబ్ కు బలంగా చెప్పొచ్చు. బౌలింగ్ లో కూడా పంజాబ్ కలిసికట్టుగా రాణిస్తోంది. పేస్ విభాగంలో మార్కో జెన్సన్, బార్ట్ లెట్ తో పాటు విజయ్ కుమార్ వైశాఖ్ సత్తా చాటుతున్నారు.

అటు ఆరంభ మ్యాచ్ లలో నిరాశపరిచిన అర్షదీప్ సింగ్ చివరికి ఫామ్ అందుకున్నాడు. స్పిన్నర్ చాహల్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండడం కూడా ఆ జట్టుకు ప్లస్ పాయింట్. హోంగ్రౌండ్ లో ఆడనున్న పంజాబ్ ఇప్పుడు ఐదో విజయంపై కన్నేసింది.

PBKS vs LSG
PBKS vs LSG

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలే సాధించిన లక్నో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం లక్నోకు ప్రధాన సమస్యగా మారింది. సారథిగానూ, అటు వ్యక్తిగతంగానూ నిరాశపరుస్తున్నాడు.

పంత్ ఫామ్ లోకి వస్తే తప్ప లక్నో గెలుపు బాట పట్టేలా లేదు. అలాగే ఓపెనర్లు మార్ష్ , మార్కరమ్ ఇంకా పూర్తిస్థాయి ఫామ్ అందుకోలేకపోవడం మైనస్ గా మారింది. అబ్దుల్ సమద్ కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇటు ముకుల్ చౌదరీ కూడా కీలకంగా చెప్పొచ్చు బౌలింగ్ లో అవేశ్ ఖాన్ , దిగ్వేశ్ రతి, ప్రిన్స్ యాదవ్, జార్జ్ లిండేపై అంచనాలున్నాయి. అయితే ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్(PBKS vs LSG) ను ఓడించాలంటే లక్నో అంచనాలకు మించి రాణించాల్సిందే.

SRH : బంతితో సన్ రైజ్..చెన్నై జోరుకు హైదరాబాద్ బ్రేక్

Related Articles

Back to top button