Just SportsLatest News

PBKS vs RCB : పంజాబ్ కు చావోరేవో..ప్లే ఆఫ్ బెర్తుపై ఆర్సీబీ కన్ను

PBKS vs RCB : బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారినట్టే

PBKS vs RCB

ఐపీఎల్ 19వ సీజన్ లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(PBKS vs RCB) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్(PBKS vs RCB) ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారినట్టే. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ ప్రదర్శన చూసిన వారెవరైనా ఆ జట్టు టైటిల్ గెలవడం ఖాయమనుకున్నారు. ఎందుకంటే వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచింది.

మధ్యలో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఫస్టాఫ్ లో అసలు ఓటమెరుగని జట్టుగా నిలిచింది. తీరా సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. దీనిలో మూడు మ్యాచ్ లు చేజేతులా ప్రత్యర్థి జట్లకు సమర్పించుకున్నవే. ఈ వరుస ఓటములతో పంజాబ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను తానే రిస్కులో పడేసుకుంది.

ప్రస్తుతం 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. నిజానికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ ఓటములకు కారణం. అటు గత మ్యాచ్ లో చెత్త బౌలింగ్ కూడా పరాజయానికి కారణమైంది.

భారీస్కోరు చేసినా, బౌలింగ్ పరంగా నిరాశపరిచింది. బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ సమిష్టిగా రాణిస్తే పంజాబ్ కు గెలుపు అవకాశాలుంటాయి. బౌలింగ్ లో మాత్రం మెరుగవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫీల్డింగ్ లో కూడా క్యాచ్ లు జారవిడిచే బలహీనతను అధిగమించాల్సిందే.

మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్ సీబీ దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ పై గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. అలాగే టాప్ 2లో లీగ్ స్టేజ్ ను ముగించే అవకాశం కూడా ఉంటుంది.

PBKS vs RCB
PBKS vs RCB

గత మ్యాచ్ లో కోల్ కతాపై విరాట్ కోహ్లీ సెంచరీతో వీరవిహారం చేశాడు. బెథెల్ ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లు ఆడలేదు. పడిక్కల్, పటిదార్ తో పాటు టిమ్ డేవిడ్ , కృనాల్ పాండ్యా వంటి వారితో బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. బౌలింగ్ లోనూ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు.

ఈ వెటరన్ పేసర్ 12 మ్యాచ్ లలో 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతనితో పాటు హ్యాజిల్ వుడ్, రసిక్ సలామ్ దార్, కృనాల్ పాండ్యా కూడా రాణిస్తున్నారు. ఇక ధర్మశాల పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించనున్న నేపథ్యంలో మరోసారి పరుగుల వరద ఖాయం.

Bermuda Triangle : బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం .. దశాబ్దాల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు

Related Articles

Back to top button