Prince Yadav : ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ కు పిలుపు..ఆప్ఘన్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే

Prince Yadav : ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది

Prince Yadav

ఐపీఎల్ ముగిసిన నాలుగు రోజులకే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ తో బిజీ కానుంది. దీనిలో భాగంగా ఆప్ఘనిస్థాన్ తో స్వదేశంలో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. రెండు ఫార్మాట్ లలోనూ గిల్ సారథ్యం వహించనుండగా.. టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్సీపై సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రిషబ్ పంత్ ను తప్పించి కేఎల్ రాహుల్ ను గిల్ కు డిప్యూటీగా నియమించారు. పంత్ పేలవ ఫామ్ తో సతమతమవుతుండడమే ఈ మార్పుకు కారణంగా భావిస్తున్నారు. కాగా ఆప్ఘనిస్థాన్ తో జరగబోయే ఈ టెస్ట్ డబ్ల్యూటీసీలో భాగం కాకపోవడంతో పలు మార్పులు చేసారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ దృష్ట్యా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.

దీంతో సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణలతో పాటు యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్(Prince Yadav), మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఎంపికయ్యారు. టెస్ట్ జట్టులో పంత్ కు బ్యాకప్ కీపర్ గా జురెల్ చోటు నిలుపుకున్నాడు. కాగా మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సిరాజ్ కు చోటు దక్కలేదు. కొత్తగా ప్రిన్స్ యాదవ్(Prince Yadav), గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటు లభించింది.

బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాలకు చోటు కల్పించినా ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డే జట్టు వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. కాగా టెస్ట్ జట్టు నుంచి జడేజాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వన్డే టీంకు సంజూ శాంసన్, జైస్వాల్ లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది.

అలాగే ఐపీఎల్ లో సత్తా చాటుతున్న వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్ ముల్లాన్ పూర్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకూ జరుగుతుంది. తర్వాత మూడు వన్డేల సిరీస్ జూన్ 14 నుంచి మొదలవుతుంది. వన్డే సిరీస్ కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యమివ్వనున్నాయి.

Prince Yadav

భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, జురెల్.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్) విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్(Prince Yadav), ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.

Dhoni : రిటైర్మెంట్ ప్రకటన రాలేదు..ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా ?

Exit mobile version