Punjab Kings : ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్..పంజాబ్ కింగ్స్‌కు ఎదురుందా ?

Punjab Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది

Punjab Kings

ఐపీఎల్ 19వ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో మ్యాచ్ కు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపుతున్న పంజాబ్ టైటిల్ వేటలో దూసుకుపోతోంది.

ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఆరు మ్యాచ్ లలో ఐదు విజయాలతో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవగా 11 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. గత సీజన్ లో రన్నరప్ తో సరిపెట్టుకున్న ఆ జట్టు ఈ సారి ఎలాగైనా టైటిల్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలో అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ దూసుకెళుతోంది. పంజాబ్ కు అతిపెద్ద అడ్వాంటేజ్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీనే. ఏ టీమ్ కు ఆడిన తనదైన వ్యూహాలతో జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపించే సత్తా అతని సొంతం. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా పంజాబ్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. అంతేకాదు వ్యక్తిగతంగానూ రాణిస్తున్నాడు.

పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, స్టోయినిస్ అదరగొడుతున్నారు. మిఛెల్ ఓవెన్ కూడా వీరికి జత కలిస్తే ఇక తిరుగుండదు. బౌలింగ్ లోనూ పంజాబ్ నిలకడగా రాణిస్తోంది. మార్కో జెన్సన్ , బార్ట్ లెట్ తో పాటు విజయ్ కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ లో అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో చాహల్ పంజాబ్ కు ప్లస్ పాయింట్. ప్రతీ మ్యాచ్ లో బౌలర్లు కలిసికట్టుగా రాణిస్తుండడం పంజాబ్ వరుస విజయాలకు కారణంగా చెప్పొచ్చు.

Punjab Kings

మరోవైపు ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుసగా రెండు విజయాలతో అదరగొట్టిన ఢిల్లీ తర్వాత రెండు ఓటములతో డీలా పడింది. మళ్లీ ఆర్సీబీ లాంటి జట్టుపై గెలిచిన ఆ జట్టు తర్వాత సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫామ్ లో ఉన్న పంజాబ్ ను ఎదుర్కోవడం సవాలే.

నిస్సాంక నిలకడలేమి ఇబ్బందిగా మారింది. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ స్థాయికి తగినట్టు రాణిస్తే భారీస్కోరు చేయొచ్చు. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ కూడా ఫినిషర్ రోల్స్ లో కీలకంగా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మిఛెల్ స్టార్క్ లేకపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఎంగిడి , నటరాజన్ , ముకేశ్ కుమార్ పేస్ ఎటాక్ ను నడిపిస్తుండగా.. స్పిన్ విభాగంలో కుల్దీప్, అక్షర్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియం చిన్న బౌండరీలు, ఫాస్ట్ ఔట్ ఫీల్డ్ కారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

Ration Cards:లక్షలాది రేషన్ కార్డుల రద్దు.. అప్‌డేట్ చేసుకునే విధానం ఇదే

Exit mobile version