Just SportsLatest News

Punjab Kings : పంజాబ్ ధనాధన్…చిత్తుగా ఓడిన సన్ రైజర్స్

Punjab Kings : ఎంత భారీ స్కోరు చేసినా సరైన బౌలింగ్ లేకుంటే ఏం లాభం... మ్యాచ్ లలో విజయాలు అందవు. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ప్రతీసారీ నెగ్గుకురాలేమన్నది సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి తెలిసొచ్చింది.

Punjab Kings

ఎంత భారీ స్కోరు చేసినా సరైన బౌలింగ్ లేకుంటే ఏం లాభం… మ్యాచ్ లలో విజయాలు అందవు. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ప్రతీసారీ నెగ్గుకురాలేమన్నది సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి తెలిసొచ్చింది. పంజాబ్ కింగ్స్(Punjab Kings) పై 219 పరుగులు చేసి చెత్త బౌలింగ్ తో చిత్తుగా ఓడిపోయింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.

లక్నోతో మ్యాచ్ లో నిరాశపరిచిన వీరిద్దరూ పంజాబ్ పై మాత్రం విశ్వరూపం చూపించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. దీంతో సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే 102 పరుగులు చేసింది. హెడ్ (38) పరుగులకు ఔటవగా… అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 74 (5 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేశాడు. హెడ్ , అభిషేక్ తొలి వికెట్ కు 8.1 ఓవర్లలోనే 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వెంటవెంటనే ఔటవ్వడంతో సన్‌రైజర్స్ జోరు‌కు బ్రేక్ పడింది.

కెప్టెన్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడినా.. హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ కొంపముంచాడు. 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 39 పరుగులే చేశాడు. దూకుడుగా ఆడుతున్న అనికేత్ వర్మ రనౌట్ కు కూడా క్లాసెన్ కారణమయ్యాడు సలీల్ అరోరా నిరాశపరచడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులే చేయగలిగింది. పవర్ ప్లేలో ఆ జట్టు స్కోరు చూసిన తర్వాత కనీసం 250 పైన కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి 5 ఓవర్లలో కేవలం 37 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ కాస్త దూకుడుగా ఆడి ఉంటే మరో 20 పరుగులు అదనంగా చేసి ఉండేది.

Punjab Kings
Punjab Kings

పిచ్ ఫ్లాట్ గా ఉండడంతో భారీ టార్గెట్ ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) దుమ్మురేపింది. సన్ రైజర్స్ కు ధీటుగా ఆడుతూ పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

వీరిద్దరినీ కట్టడి చేయడం హైదరాబాద్ బౌలర్ల వల్ల కాలేదు. దీంతో పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ 93 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 20 బంతుల్లోనే 57 (5 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేయగా.. తొలి వికెట్ పార్టనర్ షిప్ 99 పరుగులు నమోదైంది. అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా 25 బంతుల్లోనే 51 (4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు.

వీరిద్దరూ ఔటైన తర్వాత కూపర్ కన్నోలి (11) పరుగులకే వెనుదిరిగినా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు నేహల్ వధేరా కూడా రాణించడంతో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో 7 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. శ్రేయాస్ 69 (33 బంతుల్లో) రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.

Artemis 2 : క్షేమంగా ల్యాండయిన ఆర్టెమిస్‌-2…మానవసహిత చంద్రుడి మిషన్ సక్సెస్

Related Articles

Back to top button