RCB : రివెంజ్ దెబ్బ అదిరిందబ్బా..ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

RCB : ఐపీఎల్ 19వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హవా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అదరగొడుతున్న ఆర్సీబీ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది

RCB

ఐపీఎల్ 19వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హవా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అదరగొడుతున్న ఆర్సీబీ(RCB) తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా తమ హోంగ్రౌండ్ లో ఎదురైన ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. ఆర్సీబీ(RCB) బౌలర్లు చెలరేగిపోయిన వేళ ఈ సీజన్ లో అత్యల్ప స్కోరుకే ఢిల్లీ ఆలౌటైంది. భువనేశ్వర్, హ్యాజిల్ వుడ్ చెరొక ఎండ్ నుంచీ నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు క్రీజులోనే నిలవలేకపోయారు.

ఫలితంగా ఈ సీజన్ లో మరో భారీ విజయాన్ని ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో 264 పరుగుల రికార్డు స్కోరు సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అలాంటి బ్యాటింగ్ చేస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది.

అసలు ఆడుతోంది ఢిల్లీ జట్టా లేక గల్లీ జట్టా అన్న రీతిలో బ్యాటింగ్ సాగింది. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్, హ్యాజిల్ వుడ్ నిప్పులు చెరిగారు. చెరొక ఎండ్ నుంచి ఢిల్లీ బ్యాటర్లను అసలు క్రీజులో నిలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సీజన్ లో ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఇంత దారుణంగా కుప్పకూలడం ఇదే తొలిసారి. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌటయ్యే ప్రమాదం ముంగిట నిలిచింది.

ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ తో కలిసి ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 35 పరుగులు జోడించడం స్కోరు 50 దాటగలిగింది. మిల్లర్ 19 పరుగులకు ఔటవగా.. జేమీసన్ 12, పోరెల్ 30 పరుగులు చేశారు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.

RCB

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకే ఆలౌటై సీజన్ లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కేవలం 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అలాగే హ్యాజిల్ వుడ్ 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.అనంతరం స్వల్పలక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దూకుడుగా ఆడింది.

ఓపెనర్లు బెథెల్ , విరాట్ కోహ్లీ ధాటిగా ఆడారు.బెథల్ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి ఔటవగా.. తర్వాత కోహ్లీ, పడిక్కల్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. వీరిద్దరి జోరుతో 6.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 15 బంతుల్లో 23 (1 ఫోర్, 2 సిక్సర్లు) , పడిక్కల్ 13 బంతుల్లో 34 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో ఈ సీజన్ లో బెంగళూరు ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Gas Prices : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. మే 1 నుంచి గ్యాస్ ధరలు పెరుగుతాయా?

Exit mobile version