Just SportsLatest News

Rishabh Pant :ఢిల్లీ, లక్నో ట్రేడింగ్ డీల్ .. పంత్ జీతంలో భారీ కోత

Rishabh Pant :ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పడం సుమారు కన్ఫమ్ అయింది.

Rishabh Pant

ఐపీఎల్ అంటేనే కమర్షియల్…ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీల వరకూ అన్నీ డబ్బులతోనే ముడిపడి ఉంటాయి. కోట్లు పోసి కొన్న ప్లేయర్స్ ఆడకపోతే వారిని వదిలించుకోవడానికి ఫ్రాంచైజీలు ఏ మాత్రం ఆలోచించవు. అటు ఫ్రాంచైజీలతో సరైన సంబంధాలు లేకున్నా వెళ్లిపోవడానికి ప్లేయర్స్ కు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇలా వెళ్లిపోవాలి అనుకుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇపుడు రిషబ్ పంత్(Rishabh Pant) విషయంలో అదే జరగబోతోంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పడం సుమారు కన్ఫమ్ అయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత రెండు సీజన్లలో పంత్ నిరాశ పరిచాడు. ఫ్రాంచైజీ అంచనాలను అందుకోలేక పోయాడు.

అందుకే ఇటీవల సీజన్ ముగిసిన వెంటనే పంత్(Rishabh Pant) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనికి ఫ్రాంఛైజీ కూడా వెంటనే అంగీకరించి.. అతను ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతాడని ప్రకటించింది. అయితే ప్లేయర్ గా కూడా కొనసాగడానికి పంత్ సిద్ధంగా లేడు. అందుకే తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆ జట్టుతో డీల్ చర్చలు కూడా జరుగుతున్నాయి.పంత్ జీతంలో కూడా భారీ కోత పడనున్నట్లు సమాచారం.

ట్రేడింగ్ చర్చల ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ తిరిగి వస్తాడు. అతడు 2025కు ముందు వరకు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ ట్రేడ్‌లో భాగంగా కుల్దీప్ యాదవ్ లఖ్‌నవూకు వెళ్తాడు. ఈ క్రమంలో పంత్ తన వేతనంలో భారీ కోతకు ఓకే చెప్పాడు.రూ.27 కోట్లకు పంత్‌ను తీసుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కి సాధ్యం కాలేదు.

Rishabh Pant
Rishabh Pant

పంత్ సవరించిన ఫీజు అతని ప్రస్తుత జీతంలో సగం కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈ కీపర్ బ్యాటర్ సుమారు రూ..15 కోట్ల ఫీజుకు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు, లఖ్‪నవూ సూపర్ జెయింట్స్‌లో కుల్దీప్ పారితోషికం రూ.13.25 కోట్లుగా యథాతథంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ కోసం పంత్ భారీ త్యాగం చేయబోతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ పంత్(Rishabh Pant) కెప్టెన్సీలో లక్నో 2025లో 7వ స్థానంలో, 2026లో 10వ స్థానంలోనూ నిలిచింది. ఈ ట్రేడ్‌పై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Mind : సొసైటీలో నలుగురూ ఏది చేస్తే అది కరెక్ట్ అని మన సబ్‌కాన్షియస్ మైండ్ బలంగా నమ్ముతూ ఉంటుంది.

Related Articles

Back to top button