Just SportsLatest News

Mumbai Indians : హిట్..హిట్.. రోహిట్..ముంబై ఓటములకు బ్రేక్

Mumbai Indians : హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి ఇలాంటి విధ్వంసం చూసి.. గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమై కీలక సమయంలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ దుమ్మురేపాడు

Mumbai Indians

అబ్బా..ఎన్నాళ్లకెన్నాళ్లకు.. హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి ఇలాంటి విధ్వంసం చూసి.. గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమై కీలక సమయంలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ దుమ్మురేపాడు. వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అటు రికెల్టన్ కూడా రెచ్చిపోవడంతో 229 పరుగుల టార్గెట్ చిన్నబోయింది.

ఫలితంగా లక్నోకు ఏడో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై(Mumbai Indians) ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా అస్వస్థత కారణంగా దూరమైతే సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. గాయం నుండి కోలుకున్న రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నో 29 పరుగులకే ఇంగ్లీస్ వికెట్ కోల్పోయింది.

అయితే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్, ఓపెనర్ మిఛెల్ మార్ష్ తో కలిసి అదరగొట్టాడు. వీరిద్దరూ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. రెండో వికెట్ కు కేవలం 34 బంతుల్లోనే 94 పరుగులు జోడించారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పూరన్ 21 బంతుల్లోనే 63 (1 ఫోర్, 8 సిక్సర్లు) , మార్ష్ 25 బంతుల్లో 44 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యారు.

తర్వాత పంత్ (15), రఘువంశీ (11) నిరాశపరిచినా.. మార్కరమ్ 31 నాటౌట్, హిమ్మత్ సింగ్ 40 నాటౌట్ రాణించారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లక్నో 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా (0/45), దీపక్ చాహర్ (0/43), ఘజన్ ఫర్ (0/50) ఘోరంగా విఫలమయ్యారు.

తర్వాత భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ రెచ్చిపోయారు. తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో స్టేడియం నలువైపులా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించారు. పవర్ ప్లేలో 71 పరుగులు చేసిన ముంబై ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది.

Mumbai Indians
Mumbai Indians

రికెల్టన్, రోహిత్ తొలి వికెట్ కు 10.5 ఓవర్లలోనే 143 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. ఐపీఎల్ ఏ వికెట్ కైనా ముంబై తరపున ఇది ఐదో అత్యధిక భాగస్వామ్యం. రికెల్టన్ 32 బంతుల్లో 83 (6 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేయగా.. రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగిస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. చివరికి హిట్ మ్యాన్ 44 బంతుల్లో 84 ( 6 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులకు వెనుదిరిగాడు.

అనంతరం తిలక్ వర్మ(11), సూర్యకుమార్ యాదవ్ (12) రన్స్ కు ఔటయ్యారు. ఈ దశలో నమన్ ధీర్ 23 నాటౌట్, విల్ జాక్స్ 10 నాటౌట్ జట్టును గెలిపించారు. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ముంబై(Mumbai Indians)కి ఇది మూడో విజయం.

Change : అక్కడ మార్పు కోరుకున్నారు..ఇక్కడ మార్పు వద్దనుకున్నారు

Related Articles

Back to top button