Just SportsLatest News

Rohit Sharma : రోహిత్ వన్డే ఫ్యూచర్‌పై ఊహాగానాలకు బ్రేక్.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చినట్లే

Rohit Sharma : ఫ్యూచర్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా, ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-7 బ్యాటర్ల లిస్ట్‌లో హిట్ మ్యాన్ ప్లేస్ మాత్రం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.

Rohit Sharma

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ వస్తున్న వార్తలకు బీసీసీఐ అఫీషియల్‌గా ఎండ్ కార్డ్ వేసేసింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే ముగిసిన వెంటనే హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడని వస్తున్న న్యూస్‌ను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. మీడియాలో వస్తున్న కథనాలన్ని కూడా కేవలం ఊహాగానాలేనని ఆయన తేల్చిచెప్పారు.

లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో ఆఖరిది కాబోతోందనే విషయంలో ..తమ మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదని దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. రోహిత్ ఇప్పటికీ వన్డే జట్టులో కీలక సభ్యుడే అని, టీమ్ ప్రణాళికల్లో ఉన్నంత కాలం మన దేశం తరఫున ఆడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చారు. అయితే, రాబోయే వన్డే ప్రపంచకప్‌లో మాత్రం రోహిత్ ఆడతాడా లేదా అనే విషయంపైన సైకియా ఎలాంటి హామీ ఇవ్వలేదు.

నిజానికి రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ..హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశమివ్వడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాగానే రోహిత్ స్వయంగా తానే తప్పుకోవాలనే ఆలోచనలో పడ్డాడనే లీకులు బయటకు వచ్చాయి.

దీనికి తోడు ప్రస్తుత సిరీస్‌లో రోహిత్(Rohit Sharma) ఫామ్ లేమితో స్ట్రెస్ ఫేస్ చేయడంకూడా ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లు అయింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్ లండన్ వెళ్లడంతో ఆల్మోస్ట్ ఈ న్యూస్‌ను అంతా కన్ఫమ్ చేసేసుకున్నారు .

ఈ పరిణామాలపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ..రోహిత్‌కు సపోర్ట్ ఇచ్చారు. ఒక దిగ్గజ ఆటగాడి భవిష్యత్తు గురించి మేనేజ్‌మెంట్ కనీస క్లారిటీ ఇవ్వకపోవడం సరైంది కాదని అన్నారు. ఒకవేళ పక్కన పెట్టాలనుకుంటే ఆ విషయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే చెప్పాలి అని, ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే తన కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడిందని అశ్విన్ కాస్త ఘాటుగానే చెప్పారు.

Rohit Sharma
Rohit Sharma

మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ సృష్టించిన రికార్డులన్నీ కూడా అసాధారణమైనవే అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 287 వన్డేల్లో సుమారు 49 సగటుతో 11,757 పరుగులు చేసిన రోహిత్ అకౌంట్‌లో 33 సెంచరీలు ఉన్నాయి.

ఫ్యూచర్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా, ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-7 బ్యాటర్ల లిస్ట్‌లో హిట్ మ్యాన్ ప్లేస్ మాత్రం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో ఆసక్తికరంగా మారిన సమయంలో, లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో రోహిత్(Rohit Sharma) పైనే అందరి చూపూ పడుతుంది.

Gambhir : సీనియర్ల కంటే యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత..గంభీర్ వ్యూహం సరైనదేనా ?

Related Articles

Back to top button