Sanju
భారత టీ20 జట్టులో సెలక్టర్లు మరోసారి మార్పులు చేశారు. త్వరలో జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం కొంతమంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అయితే సంజూ(Sanju) శాంసన్‌ను తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో సంజూపైనే వేటు పడుతుందని చాలా మంది ఊహించారు.
వారి అంచనాలకు తగ్గట్టే జింబాబ్వే టూర్‌కు సంజూను(Sanju) పక్కన పెట్టారు. దీంతో ఇక టీ20ల్లోనూ సంజూ కెరీర్ ముగిసినట్టేనని భావిస్తున్నారు. వైభవ్‌ను కొనసాగించిన సెలక్టర్లు మిగిలిన జట్టులోనూ కీలక మార్పులు చేశారు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పాటు బ్యాకప్‌గా ప్రభ్ సిమ్రన్ సింగ్‌ను ఎంపిక చేశారు.
ఇటీవల ఐపీఎల్ 19వ సీజన్‌లో ప్రభ్ సిమ్రన్ సింగ్ పరుగుల వరద పారించాడు. టీ20ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం అతని ప్రత్యేకత. అలాగే ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌కు రెస్ట్ ఇచ్చారు. యువ ఆటగాళ్లు యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మకు చోటు దక్కింది.
మరోవైపు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టులో మార్పు చోటు చేసుకుంది. గాయంతో బాధపడుతున్న నితీష్ కుమార్ రెడ్డి వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేను సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం దూబే టీ20 జట్టులో ఉన్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత దూబే వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
చివరిసారిగా ఈ ఆల్ రౌండర్ 2024లో భారత్ తరఫున వన్డే ఆడాడు. అప్పటి నుంచి కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇప్పుడు నితీశ్ గాయంతో అతనికి చోటు దక్కింది. కాగా తొడకండరాల గాయంతో బాధపడుతున్న నితీశ్ రెడ్డి పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. కాగా జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ జూలై 23 నుంచి మొదలుకానుంది.
జింబాబ్వేతో టీ20లకు భారత జట్టుః
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టుః
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే.
🚨 News 🚨#TeamIndia squad announced for the 3️⃣-match T20I series against Zimbabwe.
More Details ▶️ https://t.co/sC19D5eW8y#ZIMvIND pic.twitter.com/ctbM5gFMtY
— BCCI (@BCCI) July 6, 2026
Mobile Recharge : భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు..ఎయిర్‌టెల్, జియో వడ్డింపులు
