Just SportsLatest News

SRH vs KKR : సన్ రైజ్ అయ్యేనా ?…కోల్ కతాతో ఈడెన్ లో మ్యాచ్

SRH vs KKR : ఐపీఎల్ 19వ సీజన్ లో గురువారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ సీజన్ ను పరాజయాలతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొట్టబోతున్నాయి

SRH vs KKR

ఐపీఎల్ 19వ సీజన్ లో గురువారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ సీజన్ ను పరాజయాలతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్(SRH vs KKR) ఢీకొట్టబోతున్నాయి. ఇరు జట్లకు బౌలింగే బలహీనంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ బౌలర్లకు సవాల్ కానుంది.

ఈ సీజన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు.

అదే సమయంలో టాప్ 3 బ్యాటర్ల వైఫల్యం కూడా ఓటమికి కారణమైంది. దీంతో ఆ మ్యాచ్ లో తప్పిదాలను సరిదిద్దుకోవడంపై ఆరెంజ్ ఆర్మీ దృష్టి పెట్టింది. బలహీనంగా ఉన్న బౌలింగ్ ను బలోపేతం చేయాలని భావిస్తోంది

ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలర్లకు ఛాలెంజ్ ఎదురుకానుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఎషాన్ మలింగాపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి.

అతని స్థానంలో బ్రైడన్ కార్స్‌ను ఆడించొచ్చు. అలాగే లియామ్ లివింగ్ స్టోన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది. అప్పుడు శివమ్ మావి, ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేనట్టే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనుండగా.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఓపెనర్లు ఇచ్చే ఆరంభంపైనే భారీస్కోరు ఆధారపడి ఉంది.. అనికేత్ వర్మ, లివింగ్ స్టోన్ ఫినిషర్ రోల్ కు కీలకం కాబోతున్నారు.

లివింగ్ స్టోన్ ను తీసుకోకుండా అరోరా తుది జట్టులో కొనసాగుతాడు. కమ్మిన్స్ లేకపోవడంతో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే పైనే బౌలింగ్ బాధ్యతలు పడనున్నాయి. హర్ష్ దూబే వద్దనుకుంటే జీషన్ అన్సారీ తుది జట్టులోకి వస్తాడు. అయితే సన్ రైజర్స్ పేస్ ఎటాక్ ఎంతవరకూ రాణిస్తుందనేది చూడాలి.

SRH vs KKR
SRH vs KKR

మరోవైపు కేకేఆర్ కూడా ఓటమితోనే ఈ టోర్నీని మొదలు పెట్టింది. తొలి మ్యాచ్ లో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు పెట్టినా బౌలింగ్ బలహీనంగా ఉండడంతో కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్ లో మాత్రం అదరగొట్టింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ , సిఫెర్ట్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు. కెప్టెన్ రహానే ఫామ్ లో ఉండగా…కామెరూన్ గ్రీన్, రఘువంశీపై అంచనాలున్నాయి.

వైస్ కెప్టెన్ గా ప్రమోట్ అయిన రింకూ సింగ్ ఫినిషర్ రోల్ పోషించాల్సి ఉంటుంది. గత రికార్డుల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 30 మ్యాచ్ లలో తలపడితే కేకేఆర్ 20 మ్యాచ్ లు గెలిచింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకే అనుకూలం.

DKR : సమీర్ రిజ్వీ ధనాధన్…లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ

Related Articles

Back to top button