Just SportsLatest News

SRH vs PBKS : సన్ రైజర్స్ పుంజుకుంటుందా ?…పంజాబ్ కింగ్స్ తో కీ ఫైట్

SRH vs PBKS : ఐపీఎల్ 19వ సీజన్ లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం జరిగే డబుల్ హెడర్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది

SRH vs PBKS

ఐపీఎల్ 19వ సీజన్ లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం జరిగే డబుల్ హెడర్ లో పంజాబ్ కింగ్స్(SRH vs PBKS) తో తలపడబోతోంది. ముల్లాన్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ను ఓటమితో ఆరంభించిన సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకుంది.

కోల్ కతా నైట్ రైడర్స్ పై భారీస్కోరు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే హోంగ్రౌండ్ లో మాత్రం చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ పై కీలక బ్యాటర్లు వైఫల్యం కొంపముంచింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , హెడ్ ఫెయిలవగా.. క్లాసెన్, నితీశ్ రెడ్డి ఆదుకున్నారు. వారిద్దరూ ఆదుకోకుంటే ఘోరపరాజయం పాలయ్యేది.

టాపార్డర్ లో నిలకడలేమి మైనస్ గా మారింది. అభిషేక్ కోల్ కతాతో మ్యాచ్ లో మాత్రమే ఆడగా.. అటు ఇషాన్ కిషన్ కూడా వైఫల్యాల బాట వీడలేదు. నితీశ్ రెడ్డి ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. క్లాసెన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. గత మ్యాచ్ లో అవకాశమిచ్చినా లివింగ్ స్టోన్ అంచనాలు అందుకోలేదు. అనికేత్ వర్మ చివర్లో మెరుపులు మెరిపిస్తుండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. అటు బౌలింగ్ లోనూ నిలకడలేమి ఇబ్బంది పెడుతోంది.

ముందు నుంచీ ఊహించినట్టుగానే సన్ రైజర్స్(SRH vs PBKS) బౌలింగ్ వీక్ గానే ఉంది. ఉనాద్కట్, హర్షల్ పటేల్ తో పాటు నితీష్ రెడ్డిపైనే పేస్ భారం పడింది. ఎహసాన్ మలింగ కూడా రాణిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ ను వారి హోంగ్రౌండ్ లో కట్టడి చేయడం సన్ రైజర్స్ బౌలర్లకు సవాల్ గా భావిస్తున్నారు.

SRH vs PBKS
SRH vs PBKS

ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు విజయాలను అందుకోగా… మరో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఆ జట్టు గుజరాత్ , చెన్నై సూపర్ కింగ్స్ పై ఛేజింగ్ చేసి గెలిచింది. బ్యాటింగ్ లో ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ , కూపర్ కన్నోలీ, నేహల్ వధేరా ఫామ్ లో ఉన్నారు.

ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. బౌలింగ్ పరంగానూ పంజాబ్ నిలకడగా రాణిస్తోంది. బార్ట్ లెట్, విజయ్ కుమార్ వైశాక్, మార్కో యెన్సన్ తో పాటు అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ లో రాణిస్తున్నారు. స్పిన్నర్ చాహల్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

AP EAPCET : ఏపీ ఈఏపీసెట్ 2026..అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి ఇవే..

Related Articles

Back to top button