Just SportsLatest News

Surya Kumar Yadav : పాక్ అడుక్కున్నా నో షేక్ హ్యాండ్.. కనీసం మొహం కూడా చూడని సూర్య

Surya Kumar Yadav : క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పటిలానే భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ఆధిపత్యం కనబరుస్తోంది.

Surya Kumar Yadav

క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పటిలానే భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ఆధిపత్యం కనబరుస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో అందరిలోనూ ఆసక్తి రేపిన అంశం నో షేక్ హ్యాండ్… గత ఏడాది ఆసియాకప్ నుంచీ పాక్ తో కరచాలనం చేసేందుకు కూడా భారత్ అంగీకరించడం లేదు. పహల్గామ్ దాడికి నిరసనగా పాకిస్థాన్ కు బుద్ది చెప్పేక్రమంలో భారత్ ఆటగాళ్లు, బీసీసీఐ నో షేక్ హ్యాండ్ విధానాన్నే కొనసాగిస్తోంది.

ఈ కారణంగానే పాక్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ ఆసియాకప్ జరిగినప్పుడు నానా హంగామా చేశాడు. పాక్ క్రికెటర్లయితే భారత్ డ్రె్సింగ్ రూమ్ దగ్గర చాలాసేపు వేచి చూడడం, పాక్ మీడియా ఓవరాక్షన్ వంటివి చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రపంచకప్ మ్యాచ్ లోనూ ఇదే అంశంపై ఆసక్తి నెలకొంది. పైగా భారత్ తో మ్యాచ్ బహిష్కరించి తర్వాత వెనక్కి తగ్గినప్పుడు పాక్ బోర్డు ఇదే అంశంపై డిమాండ్ పెట్టింది.

భారత్ తో మ్యాచ్ ఆడాలంటే హ్యాండ్ షేక్ జరగాలంటూ డిమాండ్ చేసింది. అటు మ్యాచ్ కు ముందు రోజు ఇరు జట్ల కెప్టెన్లు కూడా దీనిపై స్పందించారు. 24 గంటలు లేచి చూడమంటూ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) మాట్లాడాడు. అటు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాత్రం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలంటూ వ్యాఖ్యానించాడు. దీంతో టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఉంటుందేమో అని పలువురు అనుకున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) మాత్రం తగ్గేదే లేదనేలా ప్రవర్తించాడు. కనీసం పాక్ కెప్టెన్ మొహం కూడా చూడలేదు. అస్సలు అతన్ని పట్టించుకోనేలేదు.

Surya Kumar Yadav
Surya Kumar Yadav

కేవలం రిఫరీ, ప్రజెంటర్ ఎంబగ్వాను చూసి మాత్రమే మాట్లాడాడు. దీంతో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మొహం మాడిపోయింది. కనీసం మొహం కూడా చూడకుండా వెళ్లిపోవడంతో ఆ అవమానం పాక్ కెప్టెన్ లో స్పష్టంగా కనిపించింది. దీంతో పాకిస్థాన్ కూడా మరోసారి బాగా బుద్దిచెప్పారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. పాక్ అడుక్కున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ కనికరించలేదంటూ భారత్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కొలంబో పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఇరు జట్లు స్పిన్ వ్యూహంతో బరిలోకి దిగాయి. ఊహించినట్టుగానే భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ జట్టులోకి తిరిగి రావడంతో సంజూ శాంసన్ పై వేటు పడింది. అలాగే అర్షదీప్ ను తప్పించి కుల్దీప్ యాదవ్ ను తీసుకున్నారు. మరోవైపు పాక్ గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button