Team India : ఆసియా గేమ్స్‌‌లో డబుల్ గోల్డ్ ధమాకా..పాక్‌ను చిత్తు చేసిన శ్రేయాస్ సేన..

Team India : ఇదివరకే భారత మహిళల టీమ్.. ఆసియా గేమ్స్‌లో పసిడి పతకాన్ని గెలుచుకోగా, ఇప్పుడు పురుషుల టీమ్‌ కూడా అదే రికార్డును రిపీట్ చేస్తూ డబుల్ ధమాకా నమోదు చేసింది.

Team India

మైదానంలో భారత్, పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు నరనరాల్లో పూనకాలు వచ్చేంత హై టెన్షన్ డ్రామా నడుస్తుంది. అటువంటిది ఫైనల్ పోరులో, అది కూడా ఆసియా క్రీడల గోల్డ్ మెడల్ రేసులో ఈ రెండు టీమ్‌లు తలపడితే ఉత్కంఠ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించొచ్చు.

2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ వార్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా(Team India) యంగ్‌గన్స్ తమ ప్రతాపాన్ని చూపించి పసిడి పతకాన్ని ముద్దాడారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఫైనల్ ఫైట్‌లో చిత్తు చేసి, బంగారు కాంతులతో ఆసియా ఖండంలో భారత క్రికెట్ డామినేషన్‌ను చాటి చెప్పారు.

ఇదివరకే భారత మహిళల టీమ్ కూడా ఆసియా గేమ్స్‌లో పసిడి పతకాన్ని గెలుచుకోగా, ఇప్పుడు పురుషుల టీమ్‌ కూడా అదే రికార్డును రిపీట్ చేస్తూ డబుల్ ధమాకా నమోదు చేయడం భారత క్రీడాభిమానులకు పెద్ద పండగ వాతావరణాన్ని తీసుకువచ్చినట్లు అయింది.

ఈ హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 రన్స్ భారీ స్కోరును సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షాన్ని కురిపించాడు. కేవలం 28 బాల్స్‌లోనే 3 ఫోర్లు, 7 మైండ్ బ్లోయింగ్ సిక్సర్లతో 61 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లను చెండాడాడు.

అభిషేక్ శర్మకి తోడుగా తిలక్ వర్మ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ఆడుతూ 22 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లలో శివమ్ దూబె 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

వికెట్ కీపర్ సంజూ శాంసన్ 2 రన్స్‌తో కాస్త డిజప్పాయింట్ చేసినా..వైభవ్ సూర్యవంశీ 15, ఇషాన్ కిషన్ 20, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 21 రన్స్ చేసి తమవంతు రోల్ పోషించారు. పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డేనియల్ చెరో రెండు వికెట్లు తీయగా, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్‌ను పడగొట్టారు.

212 పరుగుల భారీ టార్గెట్‌తో మైదానంలోకి దిగిన పాకిస్తాన్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 192 రన్స్‌కే చతికిలపడింది. దీంతో టీమ్‌ఇండియా 19 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని సాధించి గోల్డ్ మెడల్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది.

Team India

పాకిస్తాన్ బ్యాటర్లలో హసన్ నవాజ్ 51 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసినా, సెంచరీతో పాటు టీమ్‌ను గెలిపించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత బౌలింగ్ కేటగిరీలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే అదిరిపోయే బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు పడగొట్టి పాక్ రన్‌రేట్‌ను కరెక్ట్ టైమ్‌లో దెబ్బతీశారు.

ఈ అద్భుత విక్టరీతో 2026 ఆసియా క్రీడల క్రికెట్ కేటగిరీలో పురుషులు, మహిళల టీమ్‌లు రెండు కూడా స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాయి. మైదానంలో టీమిండియా(Team India) చూపించిన అగ్రెసివ్ మైండ్‌సెట్, పక్కా స్ట్రాటజీనే..పాకిస్తాన్‌‌పై విజయాన్ని ఖాయం చేసి, కోట్లాది మంది భారతీయులకు పసిడి పండుగను అందించింది.

New Rules In Railways : రైల్వే రూల్స్ పూర్తిగా మార్చేసిన కేంద్రం.. ఈ తప్పులు చేస్తే షాకింగ్ జరీమానాలు

↑
Exit mobile version