Just SportsLatest News

Vaibhav : బుడ్డోడు వచ్చేశాడు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav : అసోసియేట్ దేశాల తరఫున 14 ఏళ్ల వయసులో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నా.. ఐసీసీ పూర్తి సభ్య దేశం తరఫున 15 ఏళ్ల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

Vaibhav

అసోసియేట్ దేశాల తరఫున 14 ఏళ్ల వయసులో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నా.. ఐసీసీ పూర్తి సభ్య దేశం తరఫున 15 ఏళ్ల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

భారత క్రికెట్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన చిచ్చర పిడుగు వైభవ్(Vaibhav) సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20లో డెబ్యూ చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ చేతుల మీదుగా తన ఇండియన్ క్యాప్ అందుకున్న వైభవ్.. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసాడు. సచిన్ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకూ అదే రికార్డుగా ఉంది.

తాజాగా వైభవ్(Vaibhav) 15 ఏళ్ల 99 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చి సచిన్ రికార్డును బద్దలు కొట్టేశాడు. అసోసియేట్ దేశాల తరఫున 14 ఏళ్ల వయసులో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నా.. ఐసీసీ పూర్తి సభ్య దేశం తరఫున 15 ఏళ్ల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

కాగా వైభవ్ సూర్యవంశీ కొంతకాలంగా భారత క్రికెట్‌లో సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. అండర్ 19 క్రికెట్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అందరినీ ఆకట్టుకున్న వైభవ్.. గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లందరినీ ఉతికారేశాడు.

Vaibhav
Vaibhav

మిచెల్ స్టార్క్ , బుమ్రా, కమ్మిన్స్ వంటి బౌలర్లను అలవోకగా బాదేశాడు. సీజన్ మొత్తంలో 16 మ్యాచ్ లు ఆడిన వైభవ్ 237 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతోనే ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

దీంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేశారు. ఐర్లాండ్ సిరీస్‌లో తుది జట్టుకు ఎంపిక కాలేకపోయినా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై కూడా వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Coconut Water : వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Related Articles

Back to top button