Just SportsLatest News

Vaibhav : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. తొలి వన్డేలో జింబాబ్వే చిత్తు

Vaibhav : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో విఫలమైన ఈ చిచ్చర పిడుగు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

Vaibhav

జింబాబ్వే పర్యటనలో భారత్ శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్ , మయాంక్ యాదవ్ మెరిస్తే, బ్యాటింగ్‌లో వైభవ్(Vaibhav) సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. దీంతో జింబాబ్వే చిత్తుగా ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యువ పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. భారత పేసర్లు తొలి ఓవర్ నుంచే జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి బంతికే మయాంక్ యాదవ్ అద్భుతమైన బంతితో బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అక్కడి నుంచి జింబాబ్వే వరుస వికెట్లు కోల్పోయింది.

ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబే కూడా చెలరేగడంతో జింబాబ్వే కీలక బ్యాటర్లు సికందర్ రజా, డియోన్ మైయర్స్, బెన్ కర్రాన్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ర్యాన్ బర్ల్ (26)ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. దీంతో జింబాబ్వే 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెస్లీ మాధెవెరె ఆదుకున్నాడు.

ఆ ఆల్ రౌండర్ 34 బంతుల్లో 39 పరుగులు చేయగా, వికెట్ కీపర్ మరుమణి (27) కూడా రాణించడంతో జింబాబ్వే స్కోరు 100 దాటగలిగింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2 , రవి బిష్ణోయ్ 1, దూబే 1 వికెట్ పడగొట్టారు.

తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ(1) నిరాశపరిచినా, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లపై తన సహజశైలిలో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్‌లో విఫలమైన ఈ చిచ్చర పిడుగు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

Vaibhav
Vaibhav

కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ బాదిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు.

వైభవ్(Vaibhav) సూర్యవంశీ 19 బంతుల్లో 50(4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటవగా, తర్వాత ఇషాన్ కిషన్ (35), శ్రేయాస్ (28 నాటౌట్), తిలక్ వర్మ (6 నాటౌట్ ) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 13.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరుగుతుంది.

Students Protest : నీట్ లీక్ వివాదంపై ఆగని విద్యార్థి ఉద్యమం..ఢిల్లీలో అసలేం జరుగుతోంది?

Related Articles

Back to top button