Vaibhav Sooryavanshi : చిన్న వయసులోనే పెద్ద మనసు..వండర్ కిడ్ వైభవ్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు
Vaibhav Sooryavanshi : క్రికెట్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే.. తన ట్యాలెంట్‌తో రికార్డుల దుమ్మురేపిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ..తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరి మనసులు దోచుకున్నాడు.
Vaibhav Sooryavanshi
ఏజ్ చిన్నదే .. కానీ ఆలోచనలు, సంస్కారం మాత్రం హిమాలయమంత ఎత్తులో ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ పడితే స్టేడియంలో బౌండరీల వర్షాన్ని కురిపించే యంగ్ సెన్సేషన్.. ఇప్పుడు రియల్ హీరోగా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు.
అవును..క్రికెట్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే.. తన ట్యాలెంట్‌తో రికార్డుల దుమ్మురేపిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరి మనసులు దోచుకున్నాడు. కేవలం ఆటలోనే కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీలోనూ ముందే ఉంటానని నిరూపిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న విద్యార్థుల కోసం తన చేతిని చాచాడు.
సోషల్ మీడియాలో గొప్ప విషయాలు రాబోతున్నాయి.. కాస్త వెయిట్ చేయండంటూ వైభవ్ ఒక సస్పెన్స్ పోస్ట్ పెట్టినప్పుడు నెటిజన్లు అంతా ఏ రికార్డో లేదా బ్రాండ్ ఎండార్స్‌మెంటో అయి ఉంటుందని ఊహించారు. కానీ మర్నాడే ఈ చిచ్చరపిడుగు చెప్పిన అసలు నిజం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడమే కాదు, రియల్లీ గ్రేట్ వైభవ్ అని హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ద్వారా వచ్చే డిజిటల్ ఇన్కమ్ మొత్తాన్ని, పేద విద్యార్థుల చదువుల కోసమే కేటాయిస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. స్కూల్ లేదా కాలేజీల్లో చదువుకుంటూ, ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న అర్హులైన విద్యార్థులు డైరెక్టగా తనను సంప్రదించవచ్చని, తనకు సాధ్యమైనంత వరకు ఆర్థికంగా మద్దతు అందిస్తానని వైభవ్ హామీ ఇచ్చాడు.

ఈ రోజుల్లో వేల కోట్లు సంపాదిస్తున్న బడా ప్లేయర్లు కూడా చేయని సాయాన్ని , బుడ్డోడుగా అందరితో పిలిపించుకునే వయసులోనే వైభవ్ సూర్యవంశీ( Vaibhav Sooryavanshi) చేసి చూపించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పేదరికం వల్ల ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ యువ సంచలనం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఆటలో సిక్సర్లు కొట్టడం గొప్పే కావొచ్చు, కానీ ఒకరి జీవితాన్ని నిలబెట్టేలా సాయం చేయడం అంతకంటే గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు. ఒకవైపు తన దేశం తరఫున ఆడుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే, మరోవైపు సొసైటీ పట్ల ఇంతటి పరిణతి, ప్రేమను చూపించడం వైభవ్ గొప్పమనసుకి అద్దం పడుతోంది.
I want to use my X payout to support a needy student’s education📚
If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.
I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy
— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026
Nepal – Tibet : మరో ముప్పు ముంగిట నేపాల్-టిబెట్ సరిహద్దు.. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?





