Just SportsLatest News

Cricket : ఆదుకున్న జెమీమా, కశ్వి..భారత్ మహిళల జట్టు 198 ఆలౌట్

Cricket : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా మహిళల జట్టు టి-20 సిరీస్‌ని కైవసం చేసుకుంది.. కానీ, వన్డే సిరీస్‌ని కోల్పోయింది

Cricket

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా మహిళల జట్టు టి-20 సిరీస్‌ని కైవసం చేసుకుంది.. కానీ, వన్డే సిరీస్‌ని కోల్పోయింది . ఆస్ట్రేలియా పర్యటనలో ఏకైక టెస్టు ఆడుతున్న భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో భారత జట్టు తరపున నలుగురు ప్లేయర్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. యువ క్రికెటర్లు ప్రతీకా రావల్‌, క్రాంతి గౌడ్, కాశ్వీ గౌతమ్, సయాలి సత్ఘారే టెస్ట్ క్యాప్ లు అందుకున్నారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు సరైన ఆరంభం దక్కలేదు.

స్మృతి మంధాన 4 పరుగులకే ఔటవగా.. అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ 18 రన్స్ కు ఔటైంది. అయితే షెఫాలీ వర్మ(35) , జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించారు. షెఫాలీ ఔటైనా సరే జెమీమా తర్వాతి బ్యాటర్లతో ఓ మాదిరి భాగస్వామ్యాలు నెలకొల్పింది. హర్మన్ ప్రీత్ తో 23 , దీప్తి శర్మతో 23, రిఛా ఘోష్ తో 43 పరుగులు జోడించింది. జెమీమా రోడ్రిగ్స్ 52 (7 ఫోర్లు) పరుగులకు ఔటైన తర్వాత కశ్వి గౌతమ్ ఆదుకుంది. నిలకడగా ఆడి 34 పరుగులు చేసింది.

Cricket
Cricket

దీంతో భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4 , హామిల్టన్ 3, బ్రౌన్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మహిళల జట్టుకు ఆదిలోనే సయాలీ సద్ఘరే షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (2), కెప్టెన్ అలీ హీలీ(13)లను పెవిలియన్ కు పంపింది. తర్వాత లిచ్ ఫీల్డ్ ను క్రాంతి గౌడ్ ఔట్ చేయడంతో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఎలీసా పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్ ఆదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 38 పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 96 రన్స్ చేసింది. ఎలీసా పెర్రి 43 (7 ఫోర్లు), సదర్లాండ్ 20 (3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 102 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ టూర్ లో భారత మహిళల జట్టు(Womens cricket) టీ20 సిరీస్ గెలిస్తే.. మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button