Just TechnologyJust LifestyleLatest News

AI: AI అకాడమిక్ చీటింగ్ జరుగుతుందా? యూనివర్సిటీలు, స్కూళ్లకు కొత్త సవాళ్లు?

AI:AI వల్ల, యూనివర్సిటీలు ఇప్పుడు కేవలం 'జ్ఞానాన్ని' (Knowledge) పరీక్షించడానికి బదులుగా, 'అప్లికేషన్' 'క్రిటికల్ థింకింగ్' పై దృష్టి సారిస్తున్నాయి.

AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాధనాలు, ముఖ్యంగా ChatGPT వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో (Education Sector ) అకాడమిక్ చీటింగ్ (Academic Cheating) అనే ఒక కొత్త సవాలు ఎదురైంది. ఎలా అంటే విద్యార్థులు ఇప్పుడు తమ అసైన్‌మెంట్‌లు, వ్యాసాలు (Essays), ప్రాజెక్టులు , కోడింగ్ (Coding) పనులను తక్కువ సమయంలో, దాదాపు ఎలాంటి ప్రయత్నం లేకుండా AI ద్వారా రాయించుకుంటున్నారు.

ఇది విద్య యొక్క అసలు ఉద్దేశాన్ని, అంటే విద్యార్థి ఆలోచనా సామర్థ్యాన్ని (Critical Thinking) , సమస్య పరిష్కార నైపుణ్యాలను (Problem Solving Skills) దెబ్బతీస్తోందని యూనివర్శిటీ అధికారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

డిటెక్షన్ టూల్స్ vs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నిక్స్..ఈ చీటింగ్‌ను నివారించడానికి కాలేజీలు, యూనివర్సిటీలు అపారమైన కృషి చేస్తున్నాయి. వారు AI జనరేటెడ్ కంటెంట్‌ను (AI Generated Content) గుర్తించడానికి ప్రత్యేకమైన డిటెక్షన్ టూల్స్‌ను , ప్లేగారిజం (Plagiarism – కాపీరైట్) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.

AI
AI

అయితే, విద్యార్థులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుట్‌పుట్‌ను తీసుకుని, దానిని తమ సొంత పదజాలంతో మార్చడం (Paraphrasing) ద్వారా ఈ డిటెక్షన్ టూల్స్‌ను తప్పించుకోవడానికి కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ‘కాట్ అండ్ మౌస్’ (Cat and Mouse) ఆటలో, అధ్యాపకులు తమ అసైన్‌మెంట్ పద్ధతులను మార్చాల్సిన అవసరం ఏర్పడింది.

టీచింగ్ మెథడాలజీలో మార్పు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, యూనివర్సిటీలు ఇప్పుడు కేవలం ‘జ్ఞానాన్ని’ (Knowledge) పరీక్షించడానికి బదులుగా, ‘అప్లికేషన్’ ‘క్రిటికల్ థింకింగ్’ పై దృష్టి సారిస్తున్నాయి. ఓపెన్-బుక్, ఓరల్ ఎగ్జామ్స్, , ఇంటర్వ్యూలు వంటి పద్ధతులకు మారుతున్నారు.

అంతేకాకుండా, విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ నేర్పించడం ముఖ్యం. అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చీటింగ్‌కు కాకుండా, రిసెర్చ్ , సృజనాత్మకత (Creativity) కోసం సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో వారికి శిక్షణ ఇవ్వడం అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక టూల్‌గా అంగీకరించి, దానిని విద్యా బోధనలో భాగంగా మార్చుకోగలిగితేనే ఈ సవాలును అధిగమించగలం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button