Keyboard Letters : కీబోర్డులో అక్షరాల వెనుక ఇంత కథ ఉందా? 150 ఏళ్ల మైండ్ బ్లాకింగ్ సీక్రెట్ తెలుసా?
Keyboard Letters : 1860-70ల కాలంలో యూఎస్‌ఏకి చెందిన ఇన్వెంటర్ క్రిస్టఫర్ లాథమ్ షోల్స్ తన స్నేహితులతో కలిసి ఫస్ట్ టైమ్ మెకానికల్ టైప్‌రైటర్లను డిజైన్ చేశారు.
Keyboard Letters
మనం ప్రతిరోజూ చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్ నుంచి ఆఫీసులో వాడే ల్యాప్‌టాప్, కంప్యూటర్ వరకూ ఏది చూసినా టైప్ చేయాలంటే అంతా కీబోర్డ్‌నే వాడతాం. అయితే కీబోర్డ్‌లో అక్షరాలన్నీ A, B, C, D అని వరసగా ఉండకుండా Q, W, E, R, T, Y అని అటు ఇటుగా అమర్చి ఉంటాయి. అయితే దీనికి కారణం నేటి మోడ్రన్ టెక్నాలజీకి సంబంధించింది కాదు. 150 ఏళ్ల కిందట అంటే 19వ శతాబ్దంలో జరిగిన ఒక చిత్రమైన మెకానికల్ ప్రాబ్లెమ్ నుంచి పుట్టుకొచ్చిన ఐడియా.
1860-70ల కాలంలో యూఎస్‌ఏకి చెందిన ఇన్వెంటర్ క్రిస్టఫర్ లాథమ్ షోల్స్ తన స్నేహితులతో కలిసి ఫస్ట్ టైమ్ మెకానికల్ టైప్‌రైటర్లను డిజైన్ చేశారు. మొదట్లో ఆయన ABCD క్రమంలోనే అక్షరాలను వరుసగా అమర్చారు. అయితే ఇక్కడే అతనికి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది.
ఆ కాలపు టైప్‌రైటర్లలో ప్రతీ లెటర్‌కు కూడా ఒక ఇనుప కడ్డీతో టైప్‌బార్ ఉండేది. కీబోర్డులో కీ నొక్కగానే ఆ కడ్డీ పైకి లేచి ఇంక్ రిబ్బన్ ద్వారా పేపర్ మీద పడి లెటర్‌ను ప్రింట్ చేసేది. అయితే ABCD వరుసలో ఉన్న కీబోర్డ్‌పై(Keyboard Letters) అలవాటు కొద్దీ ఎవరైనా చాలా ఫాస్ట్‌గా టైప్ చేయడం మొదలు పెట్టగానే, పక్కపక్కనే ఉన్న కడ్డీలు ఒకదానికొకటి తగులుకుని ఇరుక్కుపోయేవి. దానివల్ల టైప్‌రైటర్ జామ్ అయి టైపింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చేది.
ఈ డైలీ తలనొప్పి నుంచి బయటపడటానికి క్రిస్టఫర్ షోల్స్ క్రేజీ ప్రయోగాలు చేయగా చేయగా..చివరకు. ఈరోజు మనందరం వాడుతున్న QWERTY డిజైన్ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో టెలిగ్రాఫ్ ఆపరేటర్ల నుంచి వచ్చిన కొన్ని ప్రాక్టికల్ సలహాలు కూడా ఈ లేఅవుట్ మారడానికి అప్పట్లో బాగా హెల్ప్ అయ్యాయి. ఆ తర్వాత 1870లలో ఇ. రెమింగ్టన్ అండ్ సన్స్ అనే కంపెనీ ఈ క్యూవర్టీ టైప్‌రైటర్లను కమర్షియల్‌గా చాలా ఎక్కువగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

మెల్లగా జనాలంతా క్యూవర్టీ స్టైల్ టైపింగ్‌కే అలవాటు పడిపోయారు. ఆనాటి అలవాటే ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ల నుంచి లేటెస్ట్ వెర్షన్ కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్‌ల నుంచి చివరకు మొబైల్ ఫోన్ల టచ్ స్క్రీన్ వర్చువల్ కీబోర్డ్‌ల(Keyboard Letters) వరకూ అలానే కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి ఒక మెకానికల్ లోపాన్ని కవర్ చేయడానికి పుట్టిన ఒక చారిత్రక డిజైన్ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతోంది.





