Just TechnologyLatest News

OpenAI : ఓపెన్‌ఏఐ సీక్రెట్ మీటింగ్‌పై కన్ను..ఏఐ టెక్నాలజీతోనే దొంగను పట్టిన ఎఫ్‌బీఐ..

OpenAI :తమ ఆఫీస్‌లోనే ఉన్న ఈ సీక్రెట్ దొంగను పట్టుకోవడానికి ఓపెన్‌ఏఐ తమ సొంత ఏఐ మోడల్స్‌నే సీక్రెట్‌గా వాడటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

OpenAI

గ్లోబల్ టెక్నాలజీ వరల్డ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏఐ దిగ్గజం ఓపెన్‌ఏఐ ఆఫీస్‌లో .. షాకింగ్ సంఘటన బయటకు వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కంపెనీ హెడ్‌క్వాటర్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ డిస్కషన్స్, బిజినెస్ ప్లాన్స్ మాట్లాడుకునే ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ హాల్‌ను టార్గెట్ చేయడం వెలుగులోకి వచ్చింది.

ఈ హాల్‌లో ఉన్న టీవీ వెనుక ఉన్న యూఎస్‌బీ పోర్టులో ఒక హైటెక్ ఆడియో రికార్డింగ్ డివైస్‌ను సెట్ చేసి అది ఎవరికీ కనిపించకుండా టాయిలెట్ పేపర్‌తో కవర్ చేసేశాడు అదే ఆఫీసులో పని చేసే వ్యక్తి. గతేడాది జులైలోనే కంపెనీలో ఇంజనీర్‌గా చేరిన ఇతడు, సెప్టెంబర్ చివరి వారంలో ఈ రికార్డర్ అమర్చగా.. అలర్ట్ అయిన స్టాఫ్ దాన్ని కనిపెట్టడంతో ఇతగాడి క్రిమినల్ మైండ్ బయటపడింది. ఈ కేసులో సౌదీ అరేబియాకు చెందిన 35 ఏళ్ల అబ్దుల్‌రహమాన్ అల్ఫోజాన్‌ను.. అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.

అయితే ఈ కేసులో తమ ఆఫీస్‌లోనే ఉన్న ఈ సీక్రెట్ దొంగను పట్టుకోవడానికి ఓపెన్‌ఏఐ(OpenAI) తమ సొంత ఏఐ మోడల్స్‌నే సీక్రెట్‌గా వాడటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కంపెనీ డేటా, ఇంటర్నల్ సెక్యూరిటీ అలర్ట్స్‌ను తమ ఏఐ ద్వారా స్కాన్ చేసి చూపించిన అనుమానితులను ఫిల్టర్ చేశారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేయగా.. అల్ఫోజాన్ కాన్ఫరెన్స్ రూమ్ చుట్టూ అనుమానాస్పదంగా చాలాసార్లు తిరగడం, టీవీ వెనుక రూమ్ చెక్ చేయడం రికార్డైంది. అంతేకాదు, అతడి బ్యాగులో కూడా సరిగ్గా అటువంటిదే ఇంకో రికార్డింగ్ డివైస్ దొరకడంతో ఎఫ్‌బీఐ అతడిని వెంటనే కస్టడీలోకి తీసుకుంది.

OpenAI
OpenAI

అమెరికా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయిన సీక్రెట్స్ కొట్టేయడానికే ఇతడు ఈ పని చేసినట్లు ఎఫ్‌బీఐ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. కోర్టులో ఇతని నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే తమ మెయిన్ ఏఐ మోడల్స్, సోర్స్ కోడ్ అలాగే కస్టమర్ల డేటా విషయంలో ఎలాంటి లీకేజ్ జరగలేదని, సీక్రెట్స్ అన్నీ కూడా చాలా సేఫ్‌గా ఉన్నాయని ఓపెన్‌ఏఐ(OpenAI) క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంజనీర్‌ను వెంటనే జాబ్ నుంచి తీసేసి, ఎఫ్‌బీఐ విచారణకు తాము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.

Google AI: ఇంటర్నెట్ లేకుండానే AI యాప్ .. గూగుల్ క్రేజీ ప్రయోగం

Related Articles

Back to top button