Just TechnologyLatest News

Oracle Layoffs : 30 వేల మందిని పీకేశారు…ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

Oracle Layoffs : బడా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఊహించినట్టుగానే దిగ్గజ కంపెనీ ఒరాకిల్ తమ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది.

Oracle Layoffs

బడా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఊహించినట్టుగానే దిగ్గజ కంపెనీ ఒరాకిల్ తమ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 30 వేల మందికి పింక్ స్లిప్స్ ఇచ్చేసింది.కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతూనే ఉదయమే లే ఆఫ్(Oracle Layoffs) మెయిల్స్ తో వారిని నిద్రలేపింది.

భారత్ తో సహా చాలా దేశాల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తమకు లే ఆఫ్స్ వచ్చాయంటూ పలువురు ఒరాకిల్(Oracle Layoffs) ఎంప్లాయిస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వాడకాన్ని పెంచుకునే ఉద్దేశంతో గత కొంతకాలంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇ

ప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, అసెంచర్, మెటా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ చాలా మందిని తొలగించాయి. తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు ఒరాకిల్ కూడా చేరింది. 30 వేల మంది వరకూ తొలగింపులు ఉంటాయని వార్తలు వచ్చిన వారం రోజుల్లోనే ఆ ప్రక్రియను మొదలుపెట్టింది.

ఒరాకిల్ సంస్థ అమెరికా ప్రధాన కేంద్రంగా క్లౌడ్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, డేటాబేస్ సాఫ్ట్‌వేర్ వంటి సర్వీసుల్ని అందిస్తోంది. 30 వేల మందిలో దాదాపు 12 వేల మంది భారత్ కు చెందిన వారున్నారు. అయితే వీరిలో చాలామందికి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించిందని తెలుస్తోంది. ఉదయం 6 గంటలకు చాలా మందికి ఈ-మెయిల్ ద్వారా లే ఆఫ్స్ సమాచారం పంపించింది.

ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహారం ఉంటుందని చెప్పిన ఒరాకిల్ రాజీనామా చేస్తున్నట్టు లేఖపై సంతకం చేసిన తర్వాతేనని కండీషన్ పెట్టింది. ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిశీలించిన తర్వాత కంపెనీ సంస్థాగత మార్పుల్లో భాగంగా మీ పాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నామనీ, కంపెనీతో ఇదే మీ చివరి రోజు అని చెప్పేందుకు చింతిస్తున్నామంటూ ఈ మెయిల్ లో పేర్కొంది.

Oracle Layoffs
Oracle Layoffs

ఇప్పటి వరకూ కంపెనీ పట్ల మీరు చూపిన అంకితభావానికి కృతజ్ఞతలు చెబుతూ నిబంధనలకు అనుగుణంగా మీకు పరిహారం ప్యాకేజీ అందుతుందని తెలిపింది. ఒరాకిల్ లో ఎక్కువగా కంప్యూటింగ్ బిజినెస్ విభాగపు ఉద్యోగులపై ఎక్కువ ఎఫెక్ట్ పడినట్టు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఒరాకిల్ సంస్థ కొంత కాలంగా ఏఐ డేటా సెంటర్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దాని కోసం నిధులు సమకూర్చుకోవడంలో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఏఐ వాడకాన్ని పెంచుకునే ఉద్దేశంతోనే అమెజాన్ సంస్థ ఈ ఏడాది జనవరిలో సుమారు 12 వేల మందిని ఇంటికి పంపించేసింది. అలాగే మెటాలో 16 వేల మంది వరకూ తొలగించారు.

Gold Price : పసిడి పైపైకి..మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Related Articles

Back to top button