Just TechnologyLatest News

Starlink:ఆకాశంలో వింత వెలుగులు..స్టార్‌లింక్ శాటిలైట్ల గురించి తెలుసా?

Starlink:సూర్యకాంతి ఈ ఉపగ్రహాల సోలార్ ప్యానెల్స్ పై పడుతూ ..అవి ప్రతిబింబించడం వల్ల మనకు రాత్రివేళ ఇవి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.

Starlink

ఆకాశంలో రాత్రిపూట ఒకే వరుసలో వెళ్తున్న వెలుగులను చూసి ఈమధ్య చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది వాటిని గ్రహాంతరవాసుల నౌకలు (UFO) అని భయపడితే.. మరికొంతమంది ఏదో  ఖగోళ వింత అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ వెలుగుల వెనుక ఉన్నది స్పేస్-ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పంపిన స్టార్‌లింక్(Starlink) శాటిలైట్లు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు చాలా ఫాస్టుగా శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. భూమికి అతి తక్కువ ఎత్తులోనే (Low Earth Orbit) ఈ ఉపగ్రహాలు తిరుగుతుంటాయి. వీటన్నిటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగించినప్పుడు, అవి తమ కక్ష్యలోకి చేరుకోవడానికి ముందు ఆకాశంలో ఒక ట్రైన్ మాదిరి… ఒకదాని వెనుక ఒకటి వెళ్తూ కనిపిస్తాయి. దీనినే ‘శాటిలైట్ ట్రైన్’ అని పిలుస్తున్నారు.

Starlink
Starlink

సూర్యకాంతి ఈ ఉపగ్రహాల సోలార్ ప్యానెల్స్ పై పడుతూ ..అవి ప్రతిబింబించడం వల్ల మనకు రాత్రివేళ ఇవి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వెలుగులు కేవలం ప్రయోగించిన కొన్ని రోజుల పాటు మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. ఆ తర్వాత అవి తమ నిర్ణీత ఎత్తుకు చేరుకున్నాక సాధారణ కంటికి అసలు కనిపించవు.

అయితే ఈ స్టార్‌లింక్(Starlink) శాటిలైట్ల వల్ల అంతరిక్ష పరిశోధనలకు ఆటంకం కలుగుతోందంటూ ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా వేలాది శాటిలైట్లు ఆకాశంలోనే నిండిపోవడం వల్ల టెలిస్కోపుల ద్వారా నక్షత్రాలను పరిశీలించడం చాలా కష్టమవుతుందని వారు అంటున్నారు.. ఏదేమైనా భవిష్యత్తులో ఇంటర్నెట్ విప్లవానికి ఇవి వెన్నెముకగా మారబోతున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button