CM Revanth Reddy : పీసీసీ రిపోర్ట్‌తో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..కొండా సురేఖ మంత్రి పదవి ఊడినట్లేనా?
CM Revanth Reddy : పీసీసీ క్రమశిక్షణా కమిటీ చేతికిచ్చిన సీక్రెట్ నివేదిక ఆధారంగా ఢిల్లీ హైకమాండ్ ఎవరికి షాక్ ఇవ్వబోతోందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది.
CM Revanth Reddy
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటు పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఒక్క ఢిల్లీ టూర్ స్కెచ్‌తో గాంధీ భవన్లో గుసగుసలు పెరిగిపోయాయి. కొండా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
మంగళవారం ఉదయాన్నే ఢిల్లీలో ల్యాండ్ అయిన సీఎం రేవంత్, మధ్యాహ్నానికి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల ఫండ్స్ కోసం కొంతమంది కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతారు. అయితే ఇది పైకి రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న పర్యటనలా కనిపిస్తున్నా.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇంటర్నల్ పోరుపై ఏఐసీసీ బాస్‌లతో పంచాయితీ తేల్చడానికే ఈ హాట్ టూర్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ క్రమశిక్షణా కమిటీ చేతికిచ్చిన సీక్రెట్ నివేదిక ఆధారంగా ఢిల్లీ హైకమాండ్ ఎవరికి షాక్ ఇవ్వబోతోందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద కామెంట్లే ఈ పొలిటికల్ రచ్చకు మెయిన్ రీజన్. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. సురేఖను కేబినెట్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడమే టార్గెట్‌గా సీఎం పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌లతో బుధవారం జరిగే భేటీలో సీఎం పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో..ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఇష్యూపై ఏ టు జెడ్ చర్చించి ఈ విషయాలను క్లియర్‌గా వివరించారు. మరోవైపు కొండా సురేఖకు మద్దతుగా కొంతమంది నేతలు మీనాక్షి నటరాజన్‌తో మాట్లాడి పరిస్థితిని కవర్ చేయాలని చూసినా.. అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ రాలేదని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో కొత్త మంత్రుల చేరిక లేదంటే కేబినెట్ విస్తరణకు ఇంకా టైమ్ ఉన్నా కూడా, సురేఖను పక్కన పెట్టే విషయంలో మాత్రం ముఖ్యమంత్రి తగ్గనని కూర్చొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ పెద్దలు స్వయంగా జోక్యం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )ని ఒప్పిస్తే తప్ప వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇక కొండా సురేఖ మంత్రి పదవి ఊడటం పక్కా కన్ఫర్మ్ అయిపోయినట్లేనని తెలుస్తోంది.





