Electric Auto : ఆటో డ్రైవర్లకు బంపర్ ఆఫర్..ఆటోవాలాలకు 2 సూపర్ ఆప్షన్లు ఇస్తూ జీవో జారీ

Electric Auto : హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో రెగ్యులర్‌గా తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను పక్కా ప్లానింగ్‌తో దశలవారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చబోతున్నారు.

Electric Auto

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తరిమికొట్టి, సిటీ ట్రాన్స్‌పోర్ట్‌ను పూర్తిగా పర్యావరణ హితంగా మార్చడానికి తెలంగాణ సర్కార్ కొత్త గేర్ మార్చింది. ఇప్పటికే ఆర్టీసీలో విడతలవారీగా ఈవీ బస్సులను ప్రవేశపెడుతూ డీజిల్ బస్సుల వాడకానికి బ్రేకులు వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆటో డ్రైవర్ల ఇంధన భారాన్ని తగ్గించడమే టార్గెట్‌గా మైండ్ బ్లాకింగ్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది.

భాగ్యనగర వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులకు ఆర్థికంగా చేయూతనందించడానికి తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026ను తెర మీదకి తీసుకొచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక పథకానికి సంబంధించి రవాణా శాఖ ఇప్పటికే అఫీషియల్ జీవో కూడా జారీ చేయడంతో ప్రణాళికలు వేగవంతమయ్యాయి.

ఈ ప్రాజెక్టు కింద హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో రెగ్యులర్‌గా తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను పక్కా ప్లానింగ్‌తో దశలవారీగా ఎలక్ట్రిక్ (EV) వెహికల్స్‌గా మార్చబోతున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్‌ కింద ఏకంగా 18,766 పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా కన్వర్ట్ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.

దీని కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో త్వరలోనే ఈ కన్వర్షన్ ప్రాసెస్ గ్రౌండ్ లెవెల్‌లో స్టార్ట్ కానుంది. ఈ ఛేంజ్ పూర్తిస్థాయిలో కనుక జరిగితే సిటీలోని వేలాది మంది ఆటో డ్రైవర్ల జేబులకు చిల్లు పడకుండా భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

ఈ స్కీమ్‌ అమలులో ఆటో డ్రైవర్ల సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు క్రేజీ ఆప్షన్లను తీసుకు వచ్చింది. డ్రైవర్లు తమ వద్ద ఉన్న పాత ఆటో ఛాసిస్‌ను అలాగే ఉంచేసి, కేవలం అందులోని పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌ను తొలగించి దాని ప్లేస్‌లో ప్రభుత్వం ఆమోదించిన AIS-123 ప్రమాణాలు కలిగిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు.

దీనికోసం ఫిక్స్‌డ్ బ్యాటరీ లేదా అవసరానికి తగినట్లుగా బ్యాటరీని మార్చుకునే స్వేపింగ్( Swapping) సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. అలాగే ఇక రెండో ఆప్షన్ చూస్తే.. ఓల్డ్ ఆటోను పూర్తిగా స్క్రాప్ చేసి, దాని స్థానంలో బ్రాండ్ న్యూ ఈవీ ఆటోను కొనడం.

Electric Auto

కొత్త ఈవీ ఆటో(Electric Auto)ను కొనాలని అనుకున డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 1.5 లక్షల వరకు భారీ సబ్సిడీని కూడా ప్రకటించింది. అయితే దీనివల్ల ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్‌ కోసం పెట్టే వేలాది రూపాయల ఖర్చు పూర్తిగా మిగిలి..ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

దీనికి తోడు హైదరాబాద్ సిటీలో వాయు కాలుష్యం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం దీంతో పాటు విపరీతమైన హారన్లు, ఇంజిన్ల శబ్దాల వల్ల వచ్చే సౌండ్ పొల్యూషన్‌కు కూడా పర్మినెంట్‌గా చెక్ పడనుంది.

Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన రాక్షస వరద..ఈ వినాశనం వెనుక సైంటిఫిక్ మిస్టరీ ఇదే..

Exit mobile version