Just TelanganaJust PoliticalLatest News

Ranganath : హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌ను తొలగించండి..తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు

Ranganath : రంగనాథ్‌ను ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు పేర్కొంది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

Ranganath

చెరువులను ఆక్రమించిన కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌(Ranganath)ను తొలగించాలని ఆదేశించింది. చాలాసార్లు ఆయన కోర్టు ఉల్లంఘనలకు పాల్పడటంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రంగనాథ్ ఏకంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని గుర్తు చేసింది.

ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన ఏ అధికారి పదవిలో కొనసాగకూడదని హైకోర్టు స్పష్టం చేసింది,. రంగనాథ్‌(Ranganath)ను ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు పేర్కొంది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

అర్హత కలిగిన వ్యక్తిని హైడ్రా కొత్త కమిషనర్‌గా నియమించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రంగనాథ్‌ను తొలగించడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు తెలిపింది. ఈ వివాదం లోతుకుంటలోని ప్రైవేటు భూముల విషయంలో హైడ్రా జోక్యం చేసుకోవడంతో మొదలైంది.

ప్రైవేట్ భూముల యజమానులు కోర్టును ఆశ్రయించగా ఇప్పటికే చాలాసార్లు హైకోర్డు హైడ్రా కమిషనర్‌ను మందలించింది. ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత కూడా హైడ్రా రెండు సార్లు లోతుకుంట భూముల్లోకి వెళ్లడంతో అది తీవ్ర వివాదాస్పదమైంది. దీంతోనే ఆ భూముల యజమానులు మరోసారి న్యాయస్థానం దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు.

దీంతో కోర్టు రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతున్నట్టు తెలిపారు. లోతుకుంట సర్వేనం 1,2లో 40 ఏకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని కోర్టుకు వెల్లడించారు.

Ranganath
Ranganath

పిటిషనరే అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ రంగనాథ్ వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఒక జీవో ద్వారా ఏర్పడిన హైడ్రాకు, అన్ని చట్టాలను అతిక్రమించే అధికారాలు ఎవరిచ్చారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. రంగనాథ్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది.

తనకు తానే ఒక చట్టంలా మారిపోయారని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆయన ఉల్లంఘనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్షమాపణ అంగీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది. వెంటనే రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

Malaika Arora : కొత్త బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు..52 ఏళ్ల వయసులోనూ తగ్గడం లేదుగా

Related Articles

Back to top button