Just TelanganaJust PoliticalLatest News

Khairatabad Bypoll : ఖైరతాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు? విజయారెడ్డి పిటిషన్‌తో యాక్షన్ సీన్ మారిందా?

Khairatabad Bypoll : దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గం స్థానం ఖాళీ అయింది. దానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలక్షన్ ఫిక్స్ అనుకున్నారు.

Khairatabad Bypoll

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏ టర్న్ తిరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. అలాగే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం … న్యాయపోరాటానికి అడ్డాగా మారింది. సుమారు ఖాయం అనుకున్న ఉపఎన్నికపై ఒక్కసారిగా లీగల్ ట్విస్టులు పడటంతో రాజకీయ వర్గాల్లో టెన్షన్ పీక్స్‌కు చేరింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని ఛాలెంజ్ చేస్తూ.. కాంగ్రెస్ నేత విజయారెడ్డి వేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు బెంచ్ ముందు పెండింగ్‌లో ఉండటమే ఈ ఉత్కంఠకు అసలు కారణంగా మారింది.

కోర్టులో కేసు తేలేంత వరకు ఖైరతాబాద్ బై ఎలక్షన్స్(Khairatabad Bypoll) పెట్టొద్దంటూ విజయారెడ్డి కోరడంతో పాటు, ఆమె మీడియా ముందుకొచ్చి ఈ లీగల్ ఫైట్‌లో తనదే విజయం అనే ధీమా వ్యక్తం చేయడంతో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కింది. అంతేకాదు గత ఎన్నికల్లో దానం నాగేందర్ గెలుపు చెల్లదని ఒకవేళ కోర్టు కనుక తేల్చి చెబితే, ఆటోమేటిక్‌గా తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందంటూ విజయారెడ్డి వేసిన లెక్కలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

పిటిషన్ ఫైనల్ తీర్పు రాకముందే బై ఎలక్షన్‌కు వెళ్లడంపై విజయారెడ్డి పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టు పాత తీర్పులను గుర్తు చేశారు. ఒకవేళ తన విజ్ఞప్తిని కనుక పక్కనపెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే చూస్తూ తాను ఊరుకోనని, దానికి గల కారణాలపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Khairatabad Bypoll
Khairatabad Bypoll

ఈ పొలిటికల్ లీగల్ డ్రామాపై ఈసీ కూడా న్యాయస్థానంలో తన స్టాండ్ ఏంటో చెప్పేసింది. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏదొక విషయం తేలేవరకు ఖైరతాబాద్ బై ఎలక్షన్‌ కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వబోమని ఈసీ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ వచ్చే విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గం స్థానం ఖాళీ అయింది. దానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలక్షన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ విజయారెడ్డి తెచ్చిన పిటిషన్ పాయింట్ ఇప్పుడు..బై ఎలక్షన్‌ను న్యాయపరమైన చిక్కుల్లో పడేసింది. ఒకవేళ నిజంగానే బై ఎలక్షన్స్(Khairatabad Bypoll) వస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

West Bengal Politics : దీదీ రివర్స్ ఎంట్రీ ఇస్తే బీజేపీకి చెక్ పడినట్లేనా? అధీర్ మైండ్ గేమ్‌తో బెంగాల్ రాజకీయాల్లో భూకంపం..

Related Articles

Back to top button