Just TelanganaJust Andhra PradeshLatest News

Kommineni Srinivasa Rao : సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్ ..నిన్న నాగార్జున అరెస్ట్.. నేడు కొమ్మినేని ?

Kommineni Srinivasa Rao : ఛానల్ డిబేట్ వీడియోలో వైఎస్సార్సీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు.

Kommineni Srinivasa Rao

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు( Kommineni Srinivasa Rao)పై కేసు నమోదు అయింది. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ షో నిర్వహిస్తున్న కొమ్మినేని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పదేపదే ప్రచారం చేస్తున్న ఫేస్ బుక్ అడ్మిన్ పైనా బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

టీపీసీసీ మీడియా విభాగం ఫిర్యాదుతో బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం .. ఛానల్ డిబేట్ వీడియోలో వైఎస్సార్సీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రికి జీవో, జీవో మిస్సెలేనియస్ వంటి పదాలకు అర్థం కూడా తెలీదంటూ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిబేట్ నిర్వహించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అలాంటి వ్యాఖ్యలను ముందు అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. తర్వాత మౌనంగా ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. తర్వాత సంబంధిత వీడియోను ఫేస్‌బుక్‌లో కొనసాగిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెంటనే వీడియోను తొలగించాలని, ఐటీ రూల్స్–2021 ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఫిర్యాదు ఆధారంగా బేగంబజార్ పోలీసులు క్రైమ్ నెం. 175/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 192, 352, 353(1), 353(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేశారు. మరి ఈరోజు కొమ్మినేనిని(Kommineni Srinivasa Rao) కూడా అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

Kommineni Srinivasa Rao
Kommineni Srinivasa Rao

నిజానికి ముఖ్యమంత్రి (సీఎం) లేదా ఇతర ఉన్నతాధికారులపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరం. దీనిపై బాధితులు లేదా ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఛానెళ్లలో డిబేట్లలో పాల్గొని మాట్లాడినా ఆ పోస్టులను, కామెంట్లను వ్యాప్తి చేసిన గ్రూప్ అడ్మిన్లు, నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తారు.

Affectionate Aggression : ప్రేమతో కొరకడం, గిచ్చడం ఎందుకు చేస్తాం? అఫెక్షనేట్ అగ్రెషన్ వెనుకున్న సైకాలజీ ఏంటి?

Related Articles

Back to top button