Konda Surekha : సీఎం రేవంత్‌కు గోల్డ్ రాఖీ కట్టిన సురేఖ..రక్షా బంధన్‌తో పొలిటికల్ రచ్చకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Konda Surekha : కొండా సురేఖ సీఎం రేవంత్ నివాసానికి వెళ్లడమే కాకుండా ఆయనకు బంగారు రాఖీ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Konda Surekha
ఒకవైపు దేశమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం ఇంట్రస్టింగ్ అండ్ క్రేజీ సీన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ వాతావరణంలో.. రాష్ట్ర మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ(Konda Surekha) సీఎంకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే కొద్ది రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో హీటెక్కిన కొండా ఫ్యామిలీ మ్యాటర్‌తో ఊపందుకున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి వివాదాల మధ్య కొండా సురేఖ సీఎం రేవంత్ నివాసానికి వెళ్లడమే కాకుండా ఆయనకు బంగారు రాఖీ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరి మధ్య.. ఈ పండుగ వేడుక ప్రత్యేకంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేయించిన ఒక సూపర్ డిజైన్ గోల్డెన్ రాఖీని సీఎం రేవంత్ రెడ్డి చేతికి కట్టారు. ప్రతీ ఏడాది ఎలా అయితే అన్నయ్యగా భావించి రాఖీ కడతానో, ఈసారి కూడా అదే అనుబంధంతో కట్టానని ఆమె వెల్లడించారు.
తాను రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఇది వరుసగా మూడోసారి అని చెప్పిన సురేఖ..రాష్ట్ర ప్రజలకు ఆయన నాయకత్వంలో మంచి సుపరిపాలన అందాలని కోరుకుంటున్నానని అన్నారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాకుండా ఆయన మనవడికి, అల్లుడికి కూడా సురేఖ రాఖీలు కట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, తాను కూడా అందరిలాగే ఒక సాధారణ ఆడపడుచునని, తనను ఎవరూ స్పెషల్‌గా చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
రాఖీ పండుగకు కొద్ది రోజుల ముందే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన కొన్ని కామెంట్లు.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో పొలిటికల్ సర్కిల్ హీటెక్కిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌కి ఇది పెద్ద డ్యామేజ్ అవుతుందంటూ కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారనే టాక్ నడిచింది.

అయితే కొండా సుస్మిత చేసిన సంచలన కామెంట్ల తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డిని కొండా సురేఖ ఫేస్ టుఫేస్ కలవడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పుడు రేవంత్‌కు రాఖీ కట్టడంతో.. పాత గొడవలు, మనస్పర్థలు అన్నీ పక్కన పెట్టేసి రక్షా బంధన్ సాక్షిగా సయోధ్య కుదిరినట్లేనా అనే చర్చ మొదలైంది.
మరోవైపు కొండా ఫ్యామిలీ బీజేపీవైపు చూస్తుందన్న టాక్ నడుస్తున్న ఈ సమయంలోనే..రేవంత్ రెడ్డికి సురేఖ రాఖీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఈ భేటీపై రెండు వైపుల నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి ఆఫీషియల్ పొలిటికల్ స్టేట్‌మెంట్ రాకపోయినా.. కేవలం పండుగ అనుబంధంతోనే ఈ భేటీ జరిగిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇటీవల నడిచిన పొలిటికల్ హైడ్రామా వివాదాలకు..రాఖీతో ఫుల్‌స్టాప్ పెట్టే సెంటిమెంట్ మాస్టర్‌స్ట్రోకా అనే చర్చ సాగుతోంది





